ఎన్టీఆర్ భరోసా పింఛను పథకం కింద కొత్త పింఛన్ల కోసం రాష్ట్రవ్యాప్తంగా 13.65 లక్షల దరఖాస్తులు వచ్చాయి. మొత్తం 10 కేటగిరీల్లో దరఖాస్తులను స్వీకరించగా.. ఎంపీడీవోలు, మున్సిపల్ కమిషనర్ల స్థాయిలో నిర్వహించిన ఆరంచెల పరిశీలన ప్రక్రియ పూర్తయింది.
వృద్ధాప్య పింఛన్లకు 6.88 లక్షలు, వితంతు పింఛన్లకు 2.97 లక్షలు, దివ్యాంగుల పింఛన్లకు 1.81 లక్షల దరఖాస్తులు వచ్చాయి. డప్పు కళాకారులు, చర్మకారులు, మత్స్యకారులు, చేనేత కార్మికులు, కల్లుగీత కార్మికులు, ఒంటరి మహిళలు, హిజ్రాల కేటగిరీల్లోనూ దరఖాస్తులు నమోదయ్యాయి.
ఇప్పటివరకు జరిగిన పరిశీలనలో వృద్ధాప్య, వితంతు, ఒంటరి మహిళ, మత్స్యకారులు, చేనేత కేటగిరీల్లో 1.42 లక్షల మందిని అనర్హులుగా గుర్తించారు. వీటిలో వృద్ధాప్య కేటగిరీలోనే 99,615 మంది ఉన్నారు. మత్స్యకారుల్లో 2,173, చేనేతలో 1,953, ఒంటరి మహిళల కేటగిరీలో 659 మంది అనర్హులుగా తేలారు.
వితంతు పింఛన్లకు వచ్చిన దరఖాస్తులపై అధికారులు ప్రత్యేకంగా దృష్టి సారించారు. కొత్తగా దరఖాస్తు చేసుకున్న వారిలో కొందరి రేషన్ కార్డుల్లో భర్త పేరు ఇంకా కొనసాగుతున్నట్లు పరిశీలనలో గుర్తించారు. భర్త మరణించినప్పటికీ రేషన్ కార్డులో పేరు తొలగించకపోవడానికి పలు కారణాలు ఉన్నట్లు అధికారులు గుర్తించారు.
జిల్లాల వారీగా చూస్తే గిరిజన జిల్లాలు మినహా దాదాపు అన్ని జిల్లాల్లో 30 వేలకు పైగా దరఖాస్తులు వచ్చాయి. 16 జిల్లాల్లో ఈ సంఖ్య 50 వేలు దాటింది. అనంతపురం జిల్లాలో అత్యధికంగా 67 వేల దరఖాస్తులు నమోదయ్యాయి. ఆ తర్వాత నెల్లూరు, పల్నాడు జిల్లాలు ఉన్నాయి. పోలవరం జిల్లాలో అత్యల్పంగా 11,578 దరఖాస్తులు వచ్చాయి.
దరఖాస్తుల పరిశీలన పూర్తయినప్పటికీ ప్రక్రియ ఇక్కడితో ముగియలేదు. అర్హతపై రాష్ట్రస్థాయిలో అధికారులు మరోసారి బ్యాక్‌ఎండ్ ద్వారా వివరాలను పరిశీలించనున్నారు. అనంతరం అర్హులైన వారికి పింఛన్లు మంజూరు చేసే ప్రక్రియ కొనసాగనుంది.
Andhra pradesh Andhrapradesh APNews BreakingNews Breaking news BusinessNews CricketNews CrimeNews Crime News EducationNews EntertainmentNews Geopolitics Government Hyderabad India IndianCinema IndiaNews InternationalNews LatestNews MarketUpdate MovieNews News NewsUpdate PoliticalNews shivasakthi shivasakthienterprises shivasakthimedia shivasakthi net shivasakthinet shivasakthi news shivasakthinews ShivaSakthiUpdates ShivaShaktiNews SportsNews StockMarket TechNews Telangana TelanganaNews TeluguCinema TeluguNews Tollywood TrendingNews ViralNews Wellness WorldNews



















