బడ్జెట్ ధరలో మంచి బ్యాటరీ సామర్థ్యంతో కూడిన స్మార్ట్‌ఫోన్ కోసం చూస్తున్న వినియోగదారులను దృష్టిలో పెట్టుకుని ఒప్పో కొత్త ఫోన్‌ను తీసుకొచ్చింది. Oppo K14 Lite పేరుతో దేశీయ మార్కెట్‌లోకి అడుగుపెట్టిన ఈ స్మార్ట్‌ఫోన్‌లో 7000mAh భారీ బ్యాటరీ, 120Hz రిఫ్రెష్ రేట్ డిస్‌ప్లే, ఆక్టాకోర్ ప్రాసెసర్ వంటి ఫీచర్లు ఉన్నాయి.
ఈ ఫోన్ ఆండ్రాయిడ్ 16 ఆధారిత ColorOS 16పై పనిచేస్తుంది. Unisoc T7250 ఆక్టాకోర్ ప్రాసెసర్‌ను ఇందులో అందించారు. 6.75 అంగుళాల HD+ LCD డిస్‌ప్లే 120Hz రిఫ్రెష్ రేట్‌తో ఉండగా, గరిష్ఠంగా 900 నిట్స్ బ్రైట్‌నెస్‌ను అందిస్తుంది. ఫ్లాష్ టచ్, ఆయిలీ-హ్యాండ్ టచ్, గ్లోవ్ టచ్ వంటి ఫీచర్లు కూడా ఇందులో ఉన్నాయి.
కెమెరాల విషయానికొస్తే.. వెనుకవైపు 13MP ప్రధాన కెమెరా, ముందు 5MP సెల్ఫీ కెమెరా ఉన్నాయి. AI Clear Face, AI Smart Image Matting వంటి ఫీచర్లను అందించారు. Google Gemini, Google AI Assistant సపోర్ట్‌తో పాటు IP64 రేటింగ్ కూడా ఉంది.
ఫోన్‌లో 7000mAh బ్యాటరీని అమర్చగా, 15W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ లభిస్తుంది. రివర్స్ వైర్డ్ ఛార్జింగ్ సదుపాయం కూడా ఉంది. దీంతో ఇతర డివైజ్‌లను అవసరమైన సమయంలో ఫోన్ ద్వారా ఛార్జ్ చేసుకోవచ్చు.
ధర విషయానికొస్తే.. 4GB RAM + 64GB స్టోరేజ్ వేరియంట్ ధర రూ.16,999గా నిర్ణయించారు. Feather Purple, Stone Brown రంగుల్లో ఈ ఫోన్ లభిస్తుంది. ఫ్లిప్‌కార్ట్‌లో విక్రయాలు ప్రారంభం కానున్నాయి. ఎంపిక చేసిన బ్యాంక్ కార్డులపై లాంచ్ ఆఫర్‌లో భాగంగా రూ.1,000 వరకు డిస్కౌంట్ లభించనుండగా, మూడు నెలల నో-కాస్ట్ EMI సదుపాయం కూడా అందుబాటులో ఉంది.
Andhra pradesh Andhrapradesh APNews BreakingNews Breaking news BusinessNews CricketNews CrimeNews EducationNews EntertainmentNews Geopolitics Government Hyderabad India IndianCinema IndiaNews InternationalNews LatestNews MarketUpdate MovieNews News NewsUpdate PoliticalNews shivasakthi shivasakthienterprises shivasakthimedia shivasakthi net shivasakthinet shivasakthi news shivasakthinews ShivaSakthiUpdates ShivaShaktiMedia ShivaShaktiNews SportsNews StockMarket TechNews Telangana TelanganaNews TeluguCinema TeluguNews Tollywood TrendingNews ViralNews Wellness WorldNews



















