‘‘నేను సాధారణంగా ఎవరి జోలికి వెళ్లను. కానీ, నా జోలికి ఎవరైనా వస్తే మాత్రం…’’ అంటూ పవర్‌ఫుల్ డైలాగ్‌తో యాక్షన్ హంగామా చూపించేందుకు సిద్ధమవుతున్నారు యువ హీరో జయకృష్ణ. ఘట్టమనేని కుటుంబం నుంచి సూపర్‌స్టార్ కృష్ణ మనవడిగా వెండితెరపైకి అడుగు పెడుతున్న ఆయన మొదటి చిత్రమే ‘శ్రీనివాస మంగాపురం’ కావడం విశేషం.
సినిమా విడుదలకు ముందే ఈ ప్రాజెక్ట్‌పై భారీ క్రేజ్ నెలకొంది. ఇటీవల విడుదలైన టీజర్, యాక్షన్ టీజర్, పాటలు ప్రేక్షకులను ఆకట్టుకోవడమే కాకుండా ట్రేడ్ వర్గాల్లో కూడా మంచి బజ్ క్రియేట్ చేశాయి. దీంతో తెలుగు రాష్ట్రాలతో పాటు ఓవర్సీస్ మార్కెట్లో కూడా ఈ సినిమాకు భారీ డిమాండ్ ఏర్పడింది.
ప్రస్తుతం సినిమా బిజినెస్ ఫుల్ స్వింగ్‌లో కొనసాగుతున్నట్లు చిత్రవర్గాలు చెబుతున్నాయి. ఓవర్సీస్ రైట్స్‌తో పాటు వివిధ ఏరియాల రైట్స్‌కు మంచి స్పందన లభిస్తున్నట్లు సమాచారం. ఇది జయకృష్ణకి తొలి చిత్రం అయినప్పటికీ, నటనలో అతను చూపించిన పరిణతి అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తోందని యూనిట్ వర్గాలు అంటున్నాయి.
సవాలుతో కూడిన యాక్షన్ సన్నివేశాల్లో అతను చూపించిన ఎనర్జీ, డ్యాన్స్‌లలో కనబరిచిన ఈజ్ ప్రత్యేకంగా ఆకట్టుకుంటున్నాయని చెబుతున్నారు. ముఖ్యంగా భావోద్వేగభరిత సన్నివేశాల్లో అతని నటన ప్రేక్షకులను కట్టిపడేస్తుందని చిత్ర బృందం ధీమా వ్యక్తం చేస్తోంది.
సూపర్‌స్టార్ కృష్ణ, మహేశ్‌బాబు అభిమానుల అంచనాలకు ఏమాత్రం తగ్గకుండా ఈ సినిమా రూపొందుతోందని యూనిట్ వర్గాలు నమ్మకంగా చెబుతున్నాయి. యంగ్ టాలెంట్‌తో పాటు భారీ యాక్షన్ ఎలిమెంట్స్ కలిపి సినిమాను గ్రాండ్‌గా రూపొందించినట్లు సమాచారం.
‘ఆర్‌ఎక్స్ 100’, ‘మంగళవారం’ వంటి విభిన్న కథా చిత్రాలతో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న దర్శకుడు అజయ్ భూపతి ఈ సినిమాను డైరెక్ట్ చేశారు. ప్రముఖ నిర్మాణ సంస్థ వైజయంతి మూవీస్ సమర్పణలో జెమినీ కిరణ్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.
కథానాయికగా రషా థడానీ నటిస్తోంది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు వేగంగా జరుగుతున్నాయి. జులై 9న సినిమాను ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.
వైజయంతి మూవీస్ బ్యానర్ ఇప్పటికే మహేశ్ బాబు, ఎన్టీఆర్, అల్లు అర్జున్, రామ్ చరణ్ వంటి స్టార్ హీరోలను ఇండస్ట్రీకి పరిచయం చేసి పాన్ ఇండియా స్థాయిలో విజయాలు అందించింది. ఇప్పుడు అదే బ్యానర్ నుంచి హీరోగా వస్తున్న జయకృష్ణ ఎలాంటి ప్రభావం చూపిస్తాడన్నది సినిమా పరిశ్రమలో ఆసక్తికరంగా మారింది.
‘శ్రీనివాస మంగాపురం’తో అతను కొత్త రికార్డులు సృష్టిస్తాడా లేదా అన్నది విడుదల తర్వాత తేలనుంది.
Andhra pradesh Andhrapradesh APNews BreakingNews Breaking news BusinessNews CricketNews CrimeNews EducationNews EntertainmentNews Geopolitics Government Hyderabad India IndianCinema IndiaNews InternationalNews LatestNews MarketUpdate MovieNews News NewsUpdate PoliticalNews shivasakthi shivasakthienterprises shivasakthimedia shivasakthi net shivasakthinet shivasakthi news shivasakthinews ShivaSakthiUpdates ShivaShaktiMedia ShivaShaktiNews SportsNews StockMarket TechNews Telangana TelanganaNews TeluguCinema TeluguNews Tollywood TrendingNews ViralNews Wellness WorldNews



















