విజయవాడ వన్‌టౌన్‌లోని ప్రభుత్వ వైద్యకళాశాలలో చదువుతున్న అనస్తీషియా విభాగం పీజీ ఫైనల్ ఇయర్ విద్యార్థిని దీపిక అనుమానాస్పద పరిస్థితుల్లో మృతిచెందడం కలకలం రేపింది. బుధవారం సాయంత్రం నుంచి గురువారం ఉదయం వరకు విధుల్లో ఉండాల్సిన దీపిక, ఆస్పత్రి ఆపరేషన్ గదిలోఅనుమానాస్పదస్థితిలోపడి ఉండగా సిబ్బంది గుర్తించారు. వెంటనే పరిశీలించగా ఆమె మృతి చెందినట్లు నిర్ధారించారు.సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనాస్థలికి చేరుకుని ఆస్పత్రి సూపరింటెండెంట్‌తో కలిసి సీసీటీవీ ఫుటేజీని పరిశీలించారు.
దీపిక ఆత్మహత్య చేసుకుందా? లేక వైద్యపరమైన ఇతర కారణాలేమైనా ఉన్నాయా? అనే కోణాల్లో పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఈ ఘటనపై అన్ని అవకాశాలను పరిశీలిస్తున్నట్లు పోలీసులు తెలిపారు.
అందిన ప్రాథమిక సమాచారం ప్రకారం, బుధవారం సాయంత్రం 4 గంటల నుంచి గురువారం ఉదయం 8 గంటల వరకు దీపిక విధులు నిర్వర్తించాల్సి ఉంది. ఆకలిగా ఉందని తోటి విద్యార్థినితో ఆహారం తెప్పించుకున్న ఆమె, అనంతరం ఒంట్లో అసౌకర్యంగా ఉందని చెప్పినట్లు సమాచారం. ఈ క్రమంలో మరో వైద్య విద్యార్థిని ఆమెకు ఇంజక్షన్ చేసినట్టు తెలిసింది. రాత్రి 11.30 గంటల సమయంలో ఆపరేషన్ థియేటర్‌లోని బల్లపై అనుమానాస్పదస్థితిలో పడి ఉన్న దీపికను గమనించిన సిబ్బంది వెంటనే సహాయక చర్యలు చేపట్టినా ఫలితం లేకపోయింది.
ఈ ఘటనపై రాష్ట్ర వైద్యారోగ్యశాఖ మంత్రి సత్యకుమార్ తీవ్ర విచారం వ్యక్తం చేశారు. మృతురాలి తండ్రితో ఫోన్‌లో మాట్లాడిన మంత్రి, కుటుంబానికి ప్రభుత్వం అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. అలాగే ఈ ఘటనకు గల కారణాలపై సమగ్ర విచారణ జరిపించాలని విజయవాడ పోలీస్ కమిషనర్ **రాజశేఖర్‌బాబు**ను మంత్రి ఆదేశించారు.పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తరలించగా, పూర్తి నివేదిక వచ్చిన అనంతరం మరిన్ని వివరాలు వెల్లడయ్యే అవకాశం ఉంది. ఈ ఘటనతో ప్రభుత్వ వైద్యకళాశాల వర్గాల్లో విషాదం నెలకొనగా, విద్యార్థుల్లో ఆందోళన వ్యక్తమవుతోంది.
Amaravati Andhra pradesh Andhrapradesh AndhraPradeshNews APGovernment APNews APPolitics Breaking news BreakingNews BusinessNews Chandrababu naidu ChandrababuNaidu CricketNews CrimeNews Geopolitics Government India IndiaNews LawAndOrder Naralokesh News news24 newsalert NewsToday NewsUpdate NewsUpdates PoliceInvestigation PoliticalUpdate PublicSafety shivasakthi shivasakthienterprises shivasakthimedia shivasakthi net shivasakthinet shivasakthi news shivasakthinews Tdp Telangana TelanganaNews TeluguCinema TeluguNews Tollywood Toofan TrendingNow WorldNews



















