రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుకు కీలక సమయంలో షాక్ తగిలింది. ఆ జట్టు ఓపెనర్ ఫిల్ సాల్ట్ ఇంగ్లాండ్ వెళ్లాడు. తన వేలికి గాయం కావడంతో గత మూడు మ్యాచుల్లో బెంచ్‌కే పరిమితమయ్యాడు. గాయానికి సంబంధించి టెస్టు కోసం సాల్ట్ యూకే వెళ్లాడు. స్కానింగ్ తీసిన అనంతరం పరిస్థితిని బట్టి ఆర్సీబీ జట్టుతో చేరతాడు. శస్త్రచికిత్స అవసరమైతే మాత్రం ఈ లీగ్ నుంచి వైదొలిగినట్లే. దిల్లీతో మ్యాచ్ సమయంలో సాల్ట్ వేలికి గాయమైంది. బంతిని ఆపేందుకు ప్రయత్నించే క్రమంలో ప్రమాదం జరిగింది. ఆ తర్వాత అతడు మైదానంలోకి దిగలేదు.
బెతెల్ ఉన్నా..
ఓపెనర్‌గా దూకుడైన ఆటతీరుతో ఫిల్ సాల్ట్ పరుగులు రాబడతాడు. ఆరు మ్యాచుల్లో 202 పరుగులు చేసిన అతడు.. విరాట్ కోహ్లీతో కలిసి ఆర్సీబీకి శుభారంభాలను అందించాడు. ఇప్పుడు ప్లేఆఫ్స్ బెర్తుల కోసం పోటీ తీవ్రతరమైన సమయంలో సాల్ట్ లేకపోవడం బెంగళూరుకు దెబ్బేనని క్రికెట్ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. అతడి స్థానంలో ఇప్పటికే ఓపెనర్‌గా బెతెల్ వచ్చినా పెద్దగా ప్రభావం చూపించడం లేదు. గత మూడు మ్యాచుల్లో బెతెల్ కేవలం 39 పరుగులు మాత్రమే చేశాడు. మరి ఈ విషయంలో ఆర్సీబీ మేనేజ్‌మెంట్ ఏం చేస్తుందో చూడాలి.
Andhra pradesh Andhrapradesh AndhraPradeshNews APNews APPolitics Breaking news BreakingNews BusinessNews CricketNews CrimeNews EntertainmentNews Geopolitics governance Government India IndiaNews LatestNews LawAndOrder Movies News news24 newsalert NewsToday NewsUpdate PoliticalNews PublicSafety shivasakthi shivasakthienterprises shivasakthimedia shivasakthi net shivasakthinet shivasakthi news shivasakthinews ShivaSakthiUpdates ShivaShaktiMedia ShivaShaktiNews ShivaShaktiUpdates SportsNews Telangana TelanganaNews TeluguNews TrendingNews TrendingNow ViralNews WorldNews



















