కొండపి నుంచి మద్దులూరు మీదుగా ఒంగోలు వైపు వస్తున్న ఆర్టీసీ పల్లెవెలుగు బస్సు కొండపి–మద్దులూరు ప్రధాన రహదారిలోని ద్వారకా సీఫుడ్ సమీపంలో ప్రమాదానికి గురైంది. ఎదురుగా వస్తున్న మరో బస్సును తప్పించే ప్రయత్నంలో డ్రైవర్ ఒక్కసారిగా బస్సును పక్కకు మళ్లించడంతో అదుపు తప్పి రహదారి పక్కకు బోల్తా పడింది.
ప్రమాదం జరిగిన సమయంలో బస్సులో సుమారు 60 మంది ప్రయాణికులు ఉన్నారు. వీరిలో దాదాపు 20 మంది విద్యార్థులు ఉన్నట్లు ప్రాథమిక సమాచారం. బస్సు బోల్తా పడటంతో ప్రయాణికులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. కొందరికి స్వల్ప గాయాలు కాగా, మరికొందరికి తీవ్ర గాయాలైనట్లు తెలుస్తోంది.
ప్రమాద సమాచారం అందుకున్న వెంటనే స్థానికులు ఘటనాస్థలికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. బస్సులో చిక్కుకున్న ప్రయాణికులను బయటకు తీసి అంబులెన్సుల ద్వారా కొండపి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అక్కడ వైద్యులు క్షతగాత్రులకు చికిత్స అందిస్తున్నారు. తీవ్రంగా గాయపడిన కొందరిని మెరుగైన వైద్యం కోసం ఒంగోలు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించే అవకాశం ఉన్నట్లు సమాచారం.
రోడ్డు పక్కన ముళ్ల చెట్లు దట్టంగా పెరగడంతో మలుపు వద్ద ఎదురుగా వస్తున్న వాహనాలు సరిగా కనిపించకపోవడమే ప్రమాదానికి ప్రధాన కారణమని స్థానికులు చెబుతున్నారు. ఈ మార్గంలో తరచూ ఇలాంటి ప్రమాదాలు జరుగుతున్నాయని, రోడ్డు పక్కన ఉన్న పొదలను తొలగించి మలుపు వద్ద హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేయాలని వారు అధికారులను కోరుతున్నారు.
సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని ట్రాఫిక్‌ను క్రమబద్ధీకరించారు. ప్రమాదానికి గల ఖచ్చితమైన కారణాలపై విచారణ చేపట్టినట్లు తెలిపారు.
Andhra pradesh Andhrapradesh APNews BreakingNews Breaking news BusinessNews CricketNews CrimeNews EducationNews EntertainmentNews Geopolitics Government Hyderabad India IndianCinema IndiaNews InternationalNews LatestNews MarketUpdate MovieNews News NewsToday NewsUpdate PoliticalNews shivasakthi shivasakthienterprises shivasakthimedia shivasakthi net shivasakthinet shivasakthi news shivasakthinews ShivaSakthiUpdates ShivaShaktiMedia ShivaShaktiNews SportsNews StockMarket TechNews Telangana TelanganaNews TeluguCinema TeluguNews Tollywood TrendingNews ViralNews WorldNews



















