వర్షాకాలంలో విస్తరించే డెంగీ, మలేరియా, గన్యా, విషజ్వరాలు మరియు ఇతర కాలానుగుణ వ్యాధులను సమర్థవంతంగా నియంత్రించేందుకు జిల్లాల వారీగా ముందస్తు కార్యాచరణ చేపట్టాలని వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ అధికారులను ఆదేశించారు. విశాఖపట్నం కలెక్టరేట్‌లో ఆదివారం ఉత్తరాంధ్ర జిల్లాల వైద్య ఆరోగ్య శాఖ అధికారులతో ప్రత్యక్షంగా, అలాగే రాష్ట్ర స్థాయి ఆరోగ్య శాఖ అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఆయన సమీక్ష నిర్వహించారు.
ప్రతి గ్రామం, ప్రతి వార్డు స్థాయిలో జ్వరాల కేసులను ప్రారంభ దశలోనే గుర్తించి వెంటనే వైద్య సేవలు అందించాలని మంత్రి సూచించారు. దోమల ద్వారా వ్యాపించే వ్యాధులపై అధికారులు అత్యంత అప్రమత్తంగా ఉండాలని, ముఖ్యంగా సీజనల్ వ్యాధుల నియంత్రణలో ఎలాంటి అలసత్వం ఉండకూడదని హెచ్చరించారు.
ఆశ్రమ పాఠశాలలు, సంక్షేమ వసతిగృహాలు మరియు ప్రభావిత గ్రామాల్లో తక్షణ చర్యలు చేపట్టాలని ఆయన ఆదేశించారు. స్ప్రేయింగ్, ఫాగింగ్, మాస్ ఫీవర్ సర్వేలు వంటి కార్యక్రమాలను నిరంతరంగా నిర్వహించాలని సూచించారు. అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేస్తేనే వ్యాధుల నియంత్రణ సాధ్యమవుతుందని స్పష్టం చేశారు.
గిరిజన ప్రాంతాల్లో దోమతెరల పంపిణీపై ప్రత్యేక దృష్టి పెట్టాలని మంత్రి పేర్కొన్నారు. కీటక జనిత వ్యాధుల నియంత్రణ కోసం ఈ ఏడాది బడ్జెట్‌లో గతం కంటే అదనంగా రూ.59 కోట్లు కేటాయించినట్లు తెలిపారు.
ఈ ఏడాది జనవరి నుంచి ఈ నెల 21 వరకు ఎనిమిది జిల్లాల్లో నిర్వహించిన 12.99 లక్షల వ్యాధి నిర్ధారణ పరీక్షల్లో 2,682 మలేరియా కేసులు నమోదయ్యాయని అధికారులు మంత్రి దృష్టికి తీసుకువచ్చారు. గత ఏడాదితో పోలిస్తే ఈసారి కేసులు తగ్గుముఖం పట్టడం సానుకూల పరిణామమని ఆయన పేర్కొన్నారు.
తాగునీటి క్లోరినేషన్‌పై కూడా ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని మంత్రి సూచించారు. ప్రజారోగ్య పరిరక్షణే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని ఆయన స్పష్టం చేశారు.
Andhra pradesh Andhrapradesh APNews BreakingNews Breaking news BusinessNews CricketNews CrimeNews EducationNews EntertainmentNews Geopolitics Government Hyderabad India IndianCinema IndiaNews InternationalNews LatestNews MarketUpdate MovieNews News NewsToday NewsUpdate PoliticalNews shivasakthi shivasakthienterprises shivasakthimedia shivasakthi net shivasakthinet shivasakthi news shivasakthinews ShivaSakthiUpdates ShivaShaktiMedia ShivaShaktiNews SportsNews StockMarket TechNews Telangana TelanganaNews TeluguCinema TeluguNews Tollywood TrendingNews ViralNews WorldNews



















