హనుమకొండ జిల్లా మడికొండలోని సంక్షేమ గురుకుల విద్యాలయం (సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్)లో జరిగిన ఘటన కలకలం రేపింది. ఇంటర్ బైపీసీ ప్రథమ సంవత్సరం చదువుతున్న 11 మంది విద్యార్థినులు తరగతికి రెండు నిమిషాలు ఆలస్యంగా వచ్చారనే కారణంతో ప్రిన్సిపల్ దాసరి ఉమామహేశ్వరి తమపై దాడి చేశారని ఆరోపించారు. అందరి ముందే జుట్టు పట్టుకుని కొట్టారని, కిందపడిన వారిని తన్నారని, కులం పేరుతో దూషించారని విద్యార్థినులు వాపోయారు.
ఈ ఘటనకు నిరసనగా మంగళవారం ప్రథమ, ద్వితీయ సంవత్సరం విద్యార్థినులు వసతిగృహం నుంచి మడికొండ చౌరస్తా వరకు ర్యాలీగా వెళ్లి రోడ్డుపై బైఠాయించారు. ప్రిన్సిపల్‌ను వెంటనే సస్పెండ్ చేయాలని డిమాండ్ చేస్తూ నినాదాలు చేశారు.
సమాచారం అందుకున్న మడికొండ సీఐ పుల్యాల కిషన్ సంఘటనా స్థలానికి చేరుకుని విద్యార్థినులను శాంతింపజేయడానికి ప్రయత్నించారు. అయితే తమ సెక్రటరీ కృష్ణ ఆదిత్యతో మాట్లాడే వరకు వెళ్లబోమని విద్యార్థినులు పట్టుబట్టారు. అనంతరం గురుకులాల రాష్ట్ర జాయింట్ సెక్రటరీ సక్రునాయక్‌తో ఫోన్‌లో మాట్లాడి సమస్యలు వివరించారు. ప్రిన్సిపల్‌పై తగిన చర్యలు తీసుకుంటామని, జోనల్ అధికారిని పంపిస్తామని హామీ ఇవ్వడంతో విద్యార్థినులు ఆందోళన విరమించారు.తరువాత ఇన్‌ఛార్జి జోనల్ అధికారి అపర్ణ కళాశాలకు చేరుకుని విచారణ ప్రారంభించారు. ప్రిన్సిపల్ ఉమామహేశ్వరిని తక్షణమే సెలవులో వెళ్లాలని ఆదేశించారు. ఘటనపై పూర్తి స్థాయి విచారణ కొనసాగుతోంది.
Andhra pradesh Andhrapradesh APNews BreakingNews Breaking news BusinessNews CricketNews CrimeNews EntertainmentNews Geopolitics Government India IndiaNews InternationalNews LatestNews LawAndOrder MarketUpdate News news24 newsalert NewsToday NewsUpdate PoliticalNews PublicSafety shivasakthi shivasakthienterprises shivasakthimedia shivasakthi net shivasakthinet shivasakthi news shivasakthinews ShivaSakthiUpdates ShivaShaktiMedia ShivaShaktiNews SportsNews TechNews Telangana TelanganaNews TeluguCinema TeluguNews Tollywood TrendingNews TrendingNow ViralNews WorldNews



















