విద్యాబుద్ధులు నేర్పించి, పిల్లలను కంటికి రెప్పలా కాపాడాల్సిన ఒక గురుకుల పాఠశాల ప్రిన్సిపాల్ రాక్షసంగా ప్రవర్తించారు. ఆకలేసి ‘అన్నం కావాలి’ అని అడిగినందుకు విద్యార్థినులను మోకాళ్లపై నిలబెట్టి చిత్రహింసలకు గురిచేసిన ఘటన నల్గొండ జిల్లా దామరచర్ల బీసీ గురుకుల పాఠశాలలో కలకలం రేపింది.
రాత్రంతా మోకాళ్లపైనే..
బాధిత విద్యార్థినుల కథనం ప్రకారం.. రాత్రి భోజన సమయంలో అన్నం సరిపోలేదని, మళ్లీ పెట్టాలని కొందరు విద్యార్థినులు కోరారు. దీనిపై ఆగ్రహం వ్యక్తం చేసిన ప్రిన్సిపాల్, “ఎక్కువ అన్నం, కూరలు పెట్టడం సాధ్యం కాదు.. ఎవరైనా మళ్లీ అడిగితే అందరికీ ఇదే గతి” అంటూ విద్యార్థినులను బెదిరించారు. అంతటితో ఆగకుండా, రాత్రి 8 గంటల నుండి 9 గంటల వరకు విద్యార్థినులను హాస్టల్ ఆవరణలో మోకాళ్లపై కూర్చోబెట్టి పైశాచికానందం పొందారు.
డిస్మిస్ చేయాలని విద్యార్థి సంఘాల డిమాండ్
చిన్న పిల్లలని కూడా చూడకుండా, కనీస మానవత్వం లేకుండా ప్రవర్తించిన ప్రిన్సిపాల్ తీరుపై విద్యార్థి సంఘాలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. విద్యార్థినులను శారీరకంగా, మానసిక వేదనకు గురిచేసిన సదరు ప్రిన్సిపాల్‌ను తక్షణమే విధుల్లో నుంచి తొలగించాలని (Dismiss) డిమాండ్ చేస్తూ పాఠశాల ముందు నిరసన చేపట్టారు. ఉన్నతాధికారులు స్పందించి బాధితులకు న్యాయం చేయాలని కోరుతున్నారు.
Andhra pradesh Andhrapradesh APNews BreakingNews Breaking news BusinessNews CricketNews CrimeNews Crime News EducationNews EntertainmentNews Geopolitics Government Hyderabad India IndianCinema IndiaNews InternationalNews LatestNews MarketUpdate MovieNews News NewsUpdate PoliticalNews shivasakthi shivasakthienterprises shivasakthimedia shivasakthi net shivasakthinet shivasakthi news shivasakthinews ShivaSakthiUpdates ShivaShaktiNews SportsNews StockMarket TechNews Telangana TelanganaNews TeluguCinema TeluguNews Tollywood TrendingNews ViralNews Wellness WorldNews



















