మెగా పవర్‌స్టార్ రామ్‌చరణ్ హీరోగా దర్శకుడు బుచ్చిబాబు సానా తెరకెక్కిస్తున్న భారీ చిత్రం ‘పెద్ది’ విడుదల వాయిదా పడింది. తొలుత మార్చి 27న థియేటర్లలోకి రావాల్సిన ఈ సినిమా, అనివార్య కారణాల వల్ల ఏప్రిల్ 30కు వాయిదా పడినట్లు చిత్రబృందం అధికారికంగా ప్రకటించింది. ఈ సందర్భంగా కొత్త విడుదల తేదీతో కూడిన స్పెషల్ పోస్టర్‌ను అభిమానులతో పంచుకుంది.

గమనార్హమైన విషయం ఏమిటంటే.. పవన్ కల్యాణ్ నటిస్తున్న ‘ఉస్తాద్ భగత్‌సింగ్’ సినిమా మార్చి 26న విడుదలవుతుందని ప్రకటించిన కొద్దిసేపటికే, ‘పెద్ది’ టీమ్ కొత్త రిలీజ్ డేట్‌ను వెల్లడించింది. నెల వ్యవధిలోనే బాబాయ్–అబ్బాయి (పవన్–చరణ్) సినిమాలు విడుదలకానుండటంతో మెగా అభిమానులు సోషల్ మీడియాలో ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
గ్రామీణ నేపథ్యంతో రూపొందుతున్న స్పోర్ట్స్ డ్రామాగా ‘పెద్ది’ తెరకెక్కుతోంది. ఈ చిత్రంలో జాన్వీ కపూర్ కథానాయికగా నటిస్తుండగా, కన్నడ స్టార్ శివ రాజ్‌కుమార్, బాలీవుడ్ నటుడు దివ్యేందు శర్మ కీలక పాత్రల్లో కనిపించనున్నారు. ముఖ్యంగా హీరో–డైరెక్టర్ కాంబినేషన్, రామ్‌చరణ్–జాన్వీ జంట, అలాగే ఏఆర్ రెహమాన్ సంగీతం ఈ సినిమాపై భారీ అంచనాలు పెంచుతున్నాయి.

ఇప్పటికే విడుదలైన గ్లింప్స్‌లో క్రికెట్ ఆడుతున్న రామ్‌చరణ్ షాట్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంది. ఈ ఒక్క సీన్‌నే సినిమాపై భారీ హైప్‌ను తీసుకొచ్చిందని చెప్పవచ్చు. అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకునేలా రూపొందుతున్న ‘పెద్ది’.. ఏప్రిల్ 30న థియేటర్లలో సంచలనం సృష్టించేందుకు సిద్ధమవుతోంది.
Andhra pradesh Andhrapradesh AndhraPradeshNews APNews BreakingNews Breaking news BusinessNews CricketNews CrimeNews EntertainmentNews Geopolitics Government India IndiaNews InternationalNews LatestNews LawAndOrder MarketUpdate News news24 newsalert NewsToday NewsUpdate PoliticalNews PublicSafety shivasakthi shivasakthienterprises shivasakthimedia shivasakthi net shivasakthinet shivasakthi news shivasakthinews ShivaSakthiUpdates ShivaShaktiMedia ShivaShaktiNews SportsNews TechNews Telangana TelanganaNews TeluguCinema TeluguNews Tollywood TrendingNews ViralNews WorldNews



















