సోషల్ మీడియా రీల్స్ పిచ్చి మరో యువకుడి ప్రాణాన్ని బలితీసుకుంది. కడపలో బైక్‌పై విన్యాసాలు చేస్తూ రీల్స్ చిత్రీకరిస్తున్న యువకుడు ప్రమాదానికి గురై మృతి చెందిన ఘటన కలకలం రేపింది.
పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. కడపకు చెందిన ముబారక్ స్థానికంగా వస్త్ర దుకాణంలో పనిచేస్తున్నాడు. రాత్రి తన స్నేహితుడితో కలిసి ద్విచక్ర వాహనంపై రీల్స్ చేయాలని నిర్ణయించుకున్నాడు. ఈ క్రమంలో సుమారు మూడు కిలోమీటర్ల దూరం వరకు బైక్‌ను పైకి లేపుతూ ప్రమాదకర విన్యాసాలు చేస్తూ ప్రయాణించారు.కొద్దిదూరం వెళ్లిన అనంతరం ద్విచక్ర వాహనం అదుపు తప్పి రోడ్డుపై పడిపోయింది. ఈ ప్రమాదంలో ముబారక్ తీవ్ర గాయాలతో అక్కడికక్కడే మృతి చెందగా, అతడితో ఉన్న మరో యువకుడికి తీవ్ర గాయాలయ్యాయి. గాయపడిన యువకుడిని స్థానికులు వెంటనే ఆస్పత్రికి తరలించగా, ప్రస్తుతం చికిత్స కొనసాగుతోంది.
ఈ ఘటనతో కడప నగరంలో విషాదం నెలకొంది. ఇటీవల కాలంలో రీల్స్ కోసం బైక్‌లపై స్టంట్స్ చేయడం పెరుగుతుండటంతో వరుస ప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయి. ముఖ్యంగా రద్దీ ప్రాంతాలు, ప్రధాన రహదారులపై విన్యాసాలు చేస్తూ స్థానికులను భయాందోళనకు గురిచేస్తున్నారని ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.ఈ తరహా ఘటనలు మళ్లీ పునరావృతం కాకుండా బైక్ విన్యాసాలు, రీల్స్ చిత్రీకరణపై కఠిన చర్యలు తీసుకోవాలని స్థానికులు పోలీసులను కోరుతున్నారు. యువత సోషల్ మీడియా మోజులో పడి తమ ప్రాణాలతో చెలగాటం ఆడవద్దని పెద్దలు సూచిస్తున్నారు.
Andhra pradesh Andhrapradesh APNews BreakingNews Breaking news BusinessNews CricketNews CrimeNews EducationNews EntertainmentNews Geopolitics Government India IndianCinema IndiaNews InternationalNews LatestNews MarketUpdate MovieNews News NewsToday NewsUpdate PoliticalNews PublicSafety shivasakthi shivasakthienterprises shivasakthimedia shivasakthi net shivasakthinet shivasakthi news shivasakthinews ShivaSakthiUpdates ShivaShaktiMedia ShivaShaktiNews SportsNews StockMarket TechNews Telangana TelanganaNews TeluguCinema TeluguNews Tollywood TrendingNews ViralNews WorldNews



















