రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) గవర్నర్ సంజయ్ మల్హోత్రా పెట్రోల్, డీజిల్ ధరలపై కీలక వ్యాఖ్యలు చేశారు. పశ్చిమాసియాలో కొనసాగుతున్న ఉద్రిక్త పరిస్థితులు మరింత తీవ్రతరమైతే భారత్‌లో ఇంధన ధరల పెంపు తప్పకపోవచ్చని హెచ్చరించారు. స్విట్జర్లాండ్‌లో నిర్వహించిన అంతర్జాతీయ ఆర్థిక సదస్సులో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.
ఇరాన్ యుద్ధం కారణంగా అంతర్జాతీయ మార్కెట్‌లో ముడి చమురు సరఫరాకు అంతరాయం కలిగితే, ఆ ప్రభావం భారతదేశంపై కూడా పడుతుందని గవర్నర్ తెలిపారు. ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వం ఎక్సైజ్ సుంకాలను తగ్గించడం ద్వారా, అలాగే చమురు సంస్థలు కొంత నష్టాన్ని భరించడం ద్వారా ధరలను నియంత్రిస్తున్నాయని పేర్కొన్నారు. అయితే ఈ పరిస్థితి ఎక్కువకాలం కొనసాగడం కష్టమని స్పష్టం చేశారు.చమురు ధరలు పెరిగితే రవాణా ఖర్చులు అధికమవడంతో పాటు నిత్యావసర వస్తువుల ధరలు కూడా పెరిగే అవకాశం ఉందని తెలిపారు. దీని ప్రభావం ద్రవ్యోల్బణంపై పడుతుందని ఆందోళన వ్యక్తం చేశారు.
ఇక ప్రధాన మంత్రి నరేంద్రమోదీ కూడా ఇంధన వినియోగాన్ని తగ్గించాలని ప్రజలకు పిలుపునిచ్చారు. వీలైనంత వరకు ప్రజా రవాణాను ఉపయోగించాలని సూచించారు. అదేవిధంగా బంగారం కొనుగోళ్లను కొంతకాలం వాయిదా వేసుకోవాలని కోరారు. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం బంగారంపై కస్టమ్స్ సుంకాన్ని 6 శాతం నుంచి 15 శాతానికి పెంచింది.గత కొంతకాలంగా పెట్రోల్, డీజిల్ ధరలు పెరుగుతాయన్న ప్రచారం జరుగుతున్న వేళ ఆర్‌బీఐ గవర్నర్ వ్యాఖ్యలు మరింత ప్రాధాన్యం సంతరించుకున్నాయి.
Andhra pradesh Andhrapradesh APNews BreakingNews Breaking news BusinessNews CricketNews CrimeNews EntertainmentNews Geopolitics Government India IndiaNews InternationalNews LatestNews LawAndOrder MarketUpdate MovieNews News news24 newsalert NewsToday NewsUpdate PoliticalNews PublicSafety shivasakthi shivasakthienterprises shivasakthimedia shivasakthi net shivasakthinet shivasakthi news shivasakthinews ShivaSakthiUpdates ShivaShaktiMedia ShivaShaktiNews SportsNews TechNews Telangana TelanganaNews TeluguCinema TeluguNews Tollywood TrendingNews ViralNews WorldNews



















