ఇండో-పసిఫిక్ ప్రాంతంలో భారత్‌ను తమకు కీలకమైన వ్యూహాత్మక భాగస్వామిగా పేర్కొన్న అమెరికా తాజాగా కీలక నిర్ణయం తీసుకుంది. ఈ ప్రాంతంలో పనిచేసే అగ్రరాజ్య సైనిక కమాండ్ పేరులోని ‘ఇండో’ అనే పదాన్ని తొలగించింది.
జీ-7 సదస్సు నేపథ్యంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, భారత ప్రధాని నరేంద్ర మోదీ మధ్య ద్వైపాక్షిక భేటీ జరగనున్న సమయంలో ఈ పరిణామం చోటుచేసుకోవడం గమనార్హం.
అమెరికా రక్షణ శాఖ తెలిపిన వివరాల ప్రకారం, చారిత్రక ‘US Indo-Pacific Command’ పేరును తిరిగి ‘US Pacific Command’గా మార్చినట్లు వెల్లడించింది. “చారిత్రక మూలాలను గౌరవించడం, పసిఫిక్ ప్రాంతంలో సేవలందించే సైనికుల్లో స్ఫూర్తిని పెంపొందించడం కోసం ఈ నిర్ణయం తీసుకున్నాం” అని పెంటగాన్ పేర్కొంది.
ఈ కమాండ్‌ను తొలుత 1947 జనవరి 1న అప్పటి అమెరికా అధ్యక్షుడు హ్యారీ ఎస్. ట్రుమ్యాన్ ఏర్పాటు చేశారు. అమెరికా వెస్ట్ కోస్ట్ నుంచి భారత పశ్చిమ తీర ప్రాంతం వరకు ఇది విస్తరించి ఉంది. రెండో ప్రపంచ యుద్ధం తర్వాత ప్రాంతీయ స్థిరత్వం కోసం, కొరియన్ యుద్ధం, వియత్నాం యుద్ధం సహా అనేక ఆపరేషన్లలో ఈ కమాండ్ కీలక పాత్ర పోషించింది.
అయితే 2018లో ట్రంప్ తొలి పరిపాలన సమయంలో ఈ కమాండ్ పేరును ‘Indo-Pacific Command’గా మార్చారు. హిందూ మహాసముద్రం, పసిఫిక్ మహాసముద్రాల మధ్య పెరుగుతున్న వ్యూహాత్మక అనుసంధానాన్ని గుర్తించేందుకే ఈ మార్పు చేసినట్లు అప్పటి రక్షణ మంత్రి జేమ్స్ మ్యాటిస్ తెలిపారు.
ఇప్పుడు ఎనిమిదేళ్ల తర్వాత అమెరికా మళ్లీ పాత పేరుకు వెళ్లడం వ్యూహాత్మక చర్చలకు దారితీసింది. ఇండో-పసిఫిక్ వ్యూహంలో భారత్ పాత్రపై అమెరికా దూరం పెడుతోందా అన్న ప్రశ్నలు అంతర్జాతీయ స్థాయిలో వ్యక్తమవుతున్నాయి.
Andhra pradesh Andhrapradesh APNews BreakingNews Breaking news BusinessNews CricketNews CrimeNews EducationNews EntertainmentNews Geopolitics Government Hyderabad India IndianCinema IndiaNews InternationalNews LatestNews MarketUpdate MovieNews News NewsUpdate PoliticalNews shivasakthi shivasakthienterprises shivasakthimedia shivasakthi net shivasakthinet shivasakthi news shivasakthinews ShivaSakthiUpdates ShivaShaktiMedia ShivaShaktiNews SportsNews StockMarket TechNews Telangana TelanganaNews TeluguCinema TeluguNews Tollywood TrendingNews ViralNews Wellness WorldNews



















