ప్రకాశం జిల్లా అద్దంకిలో ఆర్‌ఎంపీ వైద్యుడి దారుణ హత్య ఘటన కలకలం రేపింది. అర్ధరాత్రి సమయంలో వైద్యం కోసం వచ్చినట్లు నటించిన దుండగులు ఆయనను కళ్లలో కారం చల్లి, కర్రలతో దాడి చేసి హత్య చేసినట్లు పోలీసులు తెలిపారు.
ధర్మవరం గ్రామానికి చెందిన మెడగం కోటిరెడ్డి (47) ఆర్‌ఎంపీగా పనిచేస్తూ కుటుంబంతో కలిసి నివసిస్తున్నారు. శనివారం రాత్రి 1.30 గంటల సమయంలో మాస్కులు ధరించిన ముగ్గురు వ్యక్తులు ఆయన ఇంటికి వచ్చి అత్యవసర వైద్యం అవసరమని చెప్పి తలుపు తట్టారు. నమ్మి తలుపు తెరవగానే ఇంట్లోకి చొరబడి దాడి చేసి హత్య చేసినట్లు దర్యాప్తులో వెల్లడైంది.
ఈ దారుణ ఘటనను చూసిన ఆయన భార్య ఆదిలక్ష్మి స్పృహ కోల్పోయారు. తర్వాత తేరుకున్న ఆమె బంధువులకు, పోలీసులకు సమాచారం అందించారు. ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తరలించి కేసు నమోదు చేశారు.మృతుడు కోటిరెడ్డి ఇటీవల బ్రహ్మంగారి మాల ధరిస్తూ ఉండటంతో ప్రతిరోజూ గ్రామంలోని కల్యాణ మండపంలో నిద్రించేవారని, శనివారం మాత్రమే ఇంటికి వచ్చిన సమయంలో ఈ ఘటన జరిగిందని గ్రామస్థులు తెలిపారు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.
Andhra pradesh Andhrapradesh APNews BreakingNews Breaking news BusinessNews CricketNews CrimeNews EducationNews EntertainmentNews Geopolitics Government Hyderabad India IndianCinema IndiaNews InternationalNews LatestNews MarketUpdate MovieNews News NewsUpdate PoliticalNews shivasakthi shivasakthienterprises shivasakthimedia shivasakthi net shivasakthinet shivasakthi news shivasakthinews ShivaSakthiUpdates ShivaShaktiMedia ShivaShaktiNews SportsNews StockMarket TechNews Telangana TelanganaNews TeluguCinema TeluguNews Tollywood TrendingNews ViralNews Wellness WorldNews



















