రోమాంచకం’ను ప్రేమకథగా ప్రారంభించినా.. సినిమా ముందుకు సాగే కొద్దీ హాస్యానికి ఎక్కువ ప్రాధాన్యం దక్కుతుంది. హీరో అన్వేష్, అతని స్నేహితుల గ్యాంగ్ మధ్య జరిగే సన్నివేశాలు సినిమాకు ప్రధాన ఆకర్షణగా నిలుస్తాయి. ముఖ్యంగా జెన్‌జీ యువత ఆలోచనా విధానం, వారి అల్లరి, ఫ్రస్ట్రేషన్, స్నేహితుల కోసం ఒకరికొకరు అండగా నిలిచే తీరు సహజంగా అనిపిస్తుంది.
మైథిలిని కలుసుకోవడానికి చెన్నై వెళ్లిన అన్వేష్‌కు ఊహించని పరిణామం ఎదురవుతుంది. అతడిని మైథిలి ఫోన్, సోషల్ మీడియాల్లో బ్లాక్ చేయడంతో కథలో ఆసక్తి మొదలవుతుంది. ఆమె ఎందుకు అలా చేసింది? అసలు ఏం జరిగింది? అనే ప్రశ్నలు ప్రేక్షకుల్లో ఉత్కంఠను పెంచుతాయి. ఈ దశ నుంచి సినిమా వేగం పుంజుకుంటుంది.
హీరో స్టార్టప్ కంపెనీ ఆలోచనతో కథ ప్రారంభమైనా.. తర్వాత ఆ అంశం పెద్దగా ప్రాధాన్యం పొందదు. హీరో, హీరోయిన్ పాత్రలు కొన్ని సందర్భాల్లో వ్యవహరించే తీరు కూడా పూర్తిగా సహజంగా అనిపించదు. ప్రేమకథను మరింత బలంగా తీర్చిదిద్దే అవకాశం ఉన్నప్పటికీ, దర్శకుడు ఎక్కువగా కామెడీ వైపు మొగ్గుచూపినట్లు కనిపిస్తుంది.
సుమంత్ ప్రభాస్‌తో పాటు అతని స్నేహితుల పాత్రలు సినిమాకు మంచి వినోదాన్ని అందిస్తాయి. వెంకటేశ్ కాకుమాను, నరేంద్ర రవి, మణి, సోహన్ తమ పాత్రలకు తగ్గట్లుగా ఆకట్టుకున్నారు. ముఖ్యంగా నరేంద్ర రవి తన కామెడీతో ప్రత్యేకంగా నవ్విస్తాడు. స్నేహితుల మధ్య సంభాషణలు, చిన్న చిన్న గొడవలు, సరదా సన్నివేశాలు ప్రేక్షకులకు బాగా కనెక్ట్ అయ్యేలా ఉన్నాయి.
సుమంత్ ప్రభాస్, అనంతిక సనీల్‌కుమార్ జోడీ తెరపై ఆకట్టుకుంటుంది. పాటలు, రొమాంటిక్ సన్నివేశాల్లో ఇద్దరి మధ్య కెమిస్ట్రీ బాగుంది. ఫ్రస్ట్రేషన్‌తో కూడిన హీరో పాత్రలో సుమంత్ కామెడీని చక్కగా పండించాడు. అనంతిక కూడా అందంగా కనిపిస్తూ తన పాత్రకు న్యాయం చేసింది.
వాసుకి వైభవ్ సంగీతం సినిమాకు ప్లస్. ముఖ్యంగా ‘రాధా రమణ’ పాట, దాని చిత్రీకరణ ఆకట్టుకుంటాయి. పవన్ పప్పుల సినిమాటోగ్రఫీ విజువల్స్‌కు మంచి రూపాన్ని ఇచ్చింది. దర్శకుడు వేణుగోపాల్‌రెడ్డి తొలి చిత్రమే అయినప్పటికీ మేకింగ్‌పై తన పట్టు చూపించాడు. కథలో కొన్ని లోపాలు ఉన్నప్పటికీ సంభాషణలతో హాస్యాన్ని పండించడంలో సక్సెస్ అయ్యాడు.
కథలోని లాజిక్‌ను పక్కనపెట్టి.. స్నేహితుల గ్యాంగ్ కామెడీని ఆస్వాదిస్తూ కాసేపు హాయిగా నవ్వుకోవాలనుకునే ప్రేక్షకులకు ‘రోమాంచకం’ మంచి కాలక్షేపం. ప్రేమకథ కంటే కామెడీకి ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చిన ఈ సినిమా నవ్వుల విషయంలో మాత్రం నిరాశపరచదు.
Andhra pradesh Andhrapradesh APNews BreakingNews Breaking news BusinessNews CricketNews CrimeNews EducationNews EntertainmentNews Geopolitics Government Hyderabad India IndianCinema IndiaNews InternationalNews LatestNews MarketUpdate MovieNews News NewsUpdate PoliticalNews shivasakthi shivasakthienterprises shivasakthimedia shivasakthi net shivasakthinet shivasakthi news shivasakthinews ShivaSakthiUpdates ShivaShaktiMedia ShivaShaktiNews SportsNews StockMarket TechNews Telangana TelanganaNews TeluguCinema TeluguNews Tollywood TrendingNews ViralNews Wellness WorldNews



















