తెలుగు యువకుడు సాయిశ్రీనివాస్‌రెడ్డి అమెరికాలో అరుదైన గౌరవాన్ని అందుకున్నారు. అమెరికాలోని ఇండియానా స్టేట్ అటార్నీగా ఆయన ప్రమాణ స్వీకారం చేయడం తెలుగు రాష్ట్రాల్లో ఆనందాన్ని నింపింది. ఈ సందర్భంగా ఏపీ మంత్రి నారా లోకేశ్ ఆయనకు ప్రత్యేక అభినందనలు తెలిపారు.
తొలి ప్రయత్నంలోనే ఈ ప్రతిష్టాత్మక స్థానం సాధించడం గొప్ప విషయమని లోకేశ్ ప్రశంసించారు. పులివెందుల మట్టిలో పుట్టి అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు పొందడం తెలుగు జాతికి గర్వకారణమన్నారు.
సాయిశ్రీనివాస్‌రెడ్డి తెదేపా ఎమ్మెల్సీ భూమిరెడ్డి రామ్‌గోపాల్‌రెడ్డి కుమారుడు. విద్యార్థి దశ నుంచే ప్రజా సేవలపై ఆసక్తి కనబరిచిన ఆయన టీఎన్‌ఎస్ఎఫ్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా కూడా సేవలందించారు. కేవలం 25 ఏళ్ల వయసులోనే మాస్టర్ ఆఫ్ లా పూర్తి చేసి అమెరికాలో తన ప్రతిభను నిరూపించారు.ఇండియానా స్టేట్ అటార్నీగా బాధ్యతలు చేపట్టడం ద్వారా తెలుగు యువత ప్రతిభ ప్రపంచస్థాయిలో మరోసారి వెలుగులోకి వచ్చింది. సాయిశ్రీనివాస్‌రెడ్డి విజయంపై పలువురు రాజకీయ, సామాజిక ప్రముఖులు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.
Andhra pradesh Andhrapradesh APNews BreakingNews Breaking news BusinessNews CricketNews CrimeNews EducationNews EntertainmentNews Geopolitics Government Hyderabad India IndianCinema IndiaNews InternationalNews LatestNews MarketUpdate MovieNews News NewsToday NewsUpdate PoliticalNews shivasakthi shivasakthienterprises shivasakthimedia shivasakthi net shivasakthinet shivasakthi news shivasakthinews ShivaSakthiUpdates ShivaShaktiMedia ShivaShaktiNews SportsNews StockMarket TechNews Telangana TelanganaNews TeluguCinema TeluguNews Tollywood TrendingNews ViralNews WorldNews



















