రాష్ట్ర అభివృద్ధి విషయంలో కేవలం అమరావతిపైనే కాదు, విశాఖపట్నాన్ని కూడా విశ్వనగరంగా తీర్చిదిద్దే దిశగా ప్రభుత్వం ముందుకెళ్తోందని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వెల్లడించారు. రాజధాని ప్రాంతంలో కిమ్స్ ఆసుపత్రి, వైద్య విశ్వవిద్యాలయ నిర్మాణానికి భూమిపూజ చేసిన అనంతరం జరిగిన సభలో సీఎం పలు కీలక ప్రకటనలు చేశారు.
రాయలసీమ ప్రాంతాన్ని రతనాల సీమగా మార్చేందుకు ప్రభుత్వం ప్రత్యేక ప్రణాళికలు అమలు చేస్తోందన్నారు. అనంతపురాన్ని ఏరోస్పేస్ హబ్‌గా, తిరుపతిని ఏరోస్పేస్ సిటీగా, కర్నూలును డ్రోన్ సిటీగా అభివృద్ధి చేయనున్నట్లు తెలిపారు. అలాగే శ్రీసిటీ ఇప్పటికే ఇండస్ట్రియల్ హబ్‌గా ఎదిగిందని పేర్కొన్నారు.
విశాఖలో 2028 ఆగస్టు 15కు ముందే గూగుల్ తన కార్యకలాపాలు ప్రారంభిస్తుందని సీఎం వెల్లడించారు. అమరావతిని దేశంలో క్వాంటం కంప్యూటింగ్‌కు ప్రధాన కేంద్రంగా తీర్చిదిద్దుతామని చెప్పారు. డిసెంబర్ నాటికి భారత్‌లో క్వాంటం టెక్నాలజీకి అమరావతి చిరునామా అవుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు.లక్ష మందికి స్కిల్ డెవలప్‌మెంట్ శిక్షణ ఇచ్చి ఉద్యోగ అవకాశాలు కల్పించడమే ప్రభుత్వ లక్ష్యమని తెలిపారు. వైద్య రంగంలో కూడా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వినియోగం పెరుగుతోందని, భవిష్యత్తులో ప్రతి ముగ్గురు వైద్యుల్లో ఒకరు తెలుగు రాష్ట్రాల నుంచే ఉండేలా కృషి చేస్తామని చెప్పారు.
ఇంధన రంగంలో విదేశాలపై ఆధారపడకుండా గ్రీన్ ఎనర్జీ ఉత్పత్తిని పెంచేందుకు చర్యలు తీసుకుంటున్నామని సీఎం తెలిపారు. ప్రతి ఇంటిపైనా సోలార్ రూఫ్‌టాప్‌లు ఏర్పాటు చేసే దిశగా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు చెప్పారు.భవిష్యత్తులో ప్రభుత్వ వ్యవస్థలో కూడా వర్క్ ఫ్రమ్ హోమ్ విధానం వచ్చే అవకాశముందని చంద్రబాబు పేర్కొన్నారు. అలాగే అరకు, పాపికొండలు, గండికోట, సూర్యలంక వంటి పర్యాటక ప్రాంతాలను ప్రపంచ స్థాయి టూరిజం కేంద్రాలుగా అభివృద్ధి చేస్తామని తెలిపారు.
Andhra pradesh Andhrapradesh APNews BreakingNews Breaking news BusinessNews CricketNews CrimeNews EducationNews EntertainmentNews Geopolitics Government Hyderabad India IndianCinema IndiaNews InternationalNews LatestNews MarketUpdate MovieNews News NewsToday NewsUpdate PoliticalNews shivasakthi shivasakthienterprises shivasakthimedia shivasakthi net shivasakthinet shivasakthi news shivasakthinews ShivaSakthiUpdates ShivaShaktiMedia ShivaShaktiNews SportsNews StockMarket TechNews Telangana TelanganaNews TeluguCinema TeluguNews Tollywood TrendingNews ViralNews WorldNews



















