రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (సీఎస్)గా సీనియర్ ఐఏఎస్ అధికారి సంజయ్ జాజు మంగళవారం సచివాలయంలో అధికారికంగా బాధ్యతలు స్వీకరించారు. ఇప్పటివరకు ప్రధాన కార్యదర్శిగా విధులు నిర్వహించిన కె. రామకృష్ణారావు పదవీ విరమణ చేయడంతో, ఆయన స్థానంలో 1992 బ్యాచ్ ఐఏఎస్ అధికారి సంజయ్ జాజు బాధ్యతలు చేపట్టారు.
బాధ్యతలు స్వీకరించిన సందర్భంగా సచివాలయంలో నూతన సీఎస్‌కు ఘన స్వాగతం లభించింది. మాజీ సీఎస్ కె. రామకృష్ణారావు పుష్పగుచ్ఛం అందజేసి శుభాకాంక్షలు తెలిపారు. ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శులు, ముఖ్య కార్యదర్శులు, వివిధ శాఖల కార్యదర్శులు, విభాగాధిపతులు, సచివాలయ అధికారులు, సిబ్బంది తదితరులు సంజయ్ జాజును పుష్పగుచ్ఛాలతో అభినందించారు.
తదనంతరం నూతన సీఎస్ సంజయ్ జాజు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో ఎంసీఆర్‌హెచ్‌ఆర్‌డీలోని బోధి పెవిలియన్‌లో మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి ఆయనను అభినందించి శుభాకాంక్షలు తెలిపారు. రాష్ట్ర పరిపాలన మరింత సమర్థవంతంగా సాగేందుకు కలిసి పనిచేయాలని సూచించారు.
కొత్త సీఎస్ బాధ్యతల స్వీకరణతో రాష్ట్ర పరిపాలనలో కొత్త దిశకు ప్రారంభం అయిందని అధికారులు అభిప్రాయపడుతున్నారు.
Andhra pradesh Andhrapradesh APNews BreakingNews Breaking news BusinessNews CricketNews CrimeNews EducationNews EntertainmentNews Geopolitics Government India IndianCinema IndiaNews InternationalNews LatestNews MarketUpdate MovieNews News NewsToday NewsUpdate PoliticalNews PublicSafety shivasakthi shivasakthienterprises shivasakthimedia shivasakthi net shivasakthinet shivasakthi news shivasakthinews ShivaSakthiUpdates ShivaShaktiMedia ShivaShaktiNews SportsNews StockMarket TechNews Telangana TelanganaNews TeluguCinema TeluguNews Tollywood TrendingNews ViralNews WorldNews



















