భాజపా జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్ మూడు రోజుల పర్యటన పార్టీ శ్రేణుల్లో కొత్త ఉత్సాహాన్ని నింపిందని భాజపా శాసనసభాపక్ష నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి తెలిపారు. రాష్ట్ర కార్యవర్గ సమావేశాల్లో ఆయన వ్యవసాయ రంగంపై తీర్మానాన్ని ప్రవేశపెట్టారు.
ఈ తీర్మానాన్ని ఎంపీ డీకే అరుణ, ఎమ్మెల్యే పాయల్ శంకర్ బలపరచగా అనంతరం ఆమోదం పొందింది. అనంతరం మీడియాతో మాట్లాడిన మహేశ్వర్ రెడ్డి, రాజకీయ తీర్మానంతో పాటు పన్నెండేళ్ల మోదీ పాలనపై ధన్యవాద తీర్మానం, రైతు సమస్యలపై తీర్మానాలను కూడా సమావేశంలో ప్రవేశపెట్టినట్లు వెల్లడించారు.
నితిన్ నబీన్ ఇచ్చిన పిలుపు మేరకు పార్టీ కార్యకర్తలు కలిసికట్టుగా ప్రజల పక్షాన పోరాటానికి సిద్ధంగా ఉన్నారని ఆయన అన్నారు. ఎన్నికలు ఇప్పటికిప్పుడు నిర్వహిస్తే కర్ణాటక, తెలంగాణల్లో కాంగ్రెస్ ఒక్క సీటు కూడా గెలవదని వ్యాఖ్యానించారు. సత్తా ఉంటే ప్రభుత్వాన్ని రద్దు చేసి ఎన్నికలకు రావాలని సవాల్ విసిరారు.
మరోవైపు ఎంపీ రఘునందన్ రావు మాట్లాడుతూ నితిన్ నబీన్ పర్యటనతో కాంగ్రెస్ నేతల్లో భయాందోళనలు మొదలయ్యాయని అన్నారు.
ముగిసిన పర్యటన
నితిన్ నబీన్ మూడు రోజుల రాష్ట్ర పర్యటన మంగళవారంతో ముగిసింది. ఈ పర్యటనలో ఆయన రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్ర మంత్రులు, కీలక నేతలు, అలాగే నాలుగు కార్పొరేషన్ల బూత్ ఇన్‌ఛార్జులతో సమావేశమయ్యారు. భవిష్యత్ కార్యాచరణపై దిశానిర్దేశం చేస్తూ, అంతర్గత సమావేశాల్లో పార్టీ పరిస్థితిపై సమీక్ష నిర్వహించారు.
Andhra pradesh Andhrapradesh APNews BreakingNews Breaking news BusinessNews CricketNews CrimeNews EducationNews EntertainmentNews Geopolitics Government India IndianCinema IndiaNews InternationalNews LatestNews MarketUpdate MovieNews News NewsToday NewsUpdate PoliticalNews PublicSafety shivasakthi shivasakthienterprises shivasakthimedia shivasakthi net shivasakthinet shivasakthi news shivasakthinews ShivaSakthiUpdates ShivaShaktiMedia ShivaShaktiNews SportsNews StockMarket TechNews Telangana TelanganaNews TeluguCinema TeluguNews Tollywood TrendingNews ViralNews WorldNews



















