సింహాద్రి అప్పన్నస్వామి వార్షిక చందనోత్సవం వైభవంగా కొనసాగుతోంది. సోమవారం తెల్లవారుజాము నుంచే భక్తులు భారీగా తరలివస్తూ ఆలయ పరిసరాలు భక్తిశ్రద్ధలతో నిండిపోయాయి. ఆలయ వంశపారంపర్య ధర్మకర్త, గోవా గవర్నర్ అశోక్ గజపతిరాజు కుటుంబ సభ్యులు స్వామివారికి తొలి చందన సమర్పణ చేసి ప్రత్యేక దర్శనం చేసుకున్నారు. రాష్ట్ర ప్రభుత్వం తరఫున హోంమంత్రి అనిత పట్టు వస్త్రాలు సమర్పించగా, అనంతరం తితిదే దేవస్థానం ప్రతినిధులు కూడా స్వామివారికి పట్టువస్త్రాలు అర్పించారు. మంత్రులు కొండపల్లి శ్రీనివాస్, కొల్లు రవీంద్ర సహా పలువురు ప్రముఖులు స్వామివారిని దర్శించుకుని ఆశీస్సులు పొందారు.
స్వామివారి నిజరూప దర్శనానికి లక్షలాది మంది భక్తులు రానుండటంతో ఆలయ అధికారులు విస్తృత ఏర్పాట్లు చేపట్టారు. భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని క్యూలైన్‌లు, ప్రత్యేక ప్రవేశ మార్గాలు, తాగునీరు, ప్రసాదం, వైద్య సేవలు వంటి సౌకర్యాలను ఏర్పాటు చేశారు. భద్రతా చర్యల భాగంగా భారీగా పోలీసు బలగాలను మోహరించారు.
చందనోత్సవాన్ని పురస్కరించుకుని అప్పన్న స్వామి ఆలయాన్ని అద్భుతంగా అలంకరించారు. అంతరాలయం, ఉపాలయాలు, ధ్వజస్తంభం, కల్యాణ మండపం ప్రాంతాలను పుష్పాలతో శోభాయమానంగా తీర్చిదిద్దారు. రంగురంగుల విద్యుద్దీపాలతో ఆలయం మరింత ఆకర్షణీయంగా కనిపిస్తోంది. భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా ఎక్కడికక్కడ సూచిక బోర్డులు ఏర్పాటు చేసి సులభ మార్గదర్శనం కల్పించారు.భక్తులు స్వామివారి దర్శనంతో ఆధ్యాత్మిక ఆనందాన్ని పొందుతూ, “అప్పన్న స్వామి” నామస్మరణతో ఆలయ పరిసరాలు భక్తిరసంతో మోగిపోతున్నాయి.
Andhra pradesh Andhrapradesh APNews BreakingNews Breaking news BusinessNews CricketNews CrimeNews EducationNews EntertainmentNews Geopolitics Government Hyderabad India IndianCinema IndiaNews InternationalNews LatestNews MarketUpdate MovieNews News NewsUpdate PoliticalNews shivasakthi shivasakthienterprises shivasakthimedia shivasakthi net shivasakthinet shivasakthi news shivasakthinews ShivaSakthiUpdates ShivaShaktiMedia ShivaShaktiNews SportsNews StockMarket TechNews Telangana TelanganaNews TeluguCinema TeluguNews Tollywood TrendingNews ViralNews Wellness WorldNews


















