ఉత్తర్‌ప్రదేశ్‌లోని గాజియాబాద్‌లో ఆన్లైన్ గేమింగ్ వ్యసనం కారణంగా ముగ్గురు అక్కాచెల్లెళ్లు ఆత్మహత్య చేసుకున్న ఘటన దేశవ్యాప్తంగా తీవ్ర కలకలం రేపింది. ఈ విషాద ఘటనపై ప్రముఖ నటుడు, సామాజిక సేవకుడు సోనూసూద్ తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. 16 ఏళ్లలోపు పిల్లలను సోషల్ మీడియా, ఆన్లైన్ గేమింగ్‌కు దూరంగా ఉంచాలని తల్లిదండ్రులకు ఆయన గట్టిగా విజ్ఞప్తి చేశారు. ఈ సందర్భంగా సోనూసూద్ మాట్లాడుతూ, “ఈ పిల్లలు హింస వల్లగానీ, పేదరికం వల్లగానీ ప్రాణాలు కోల్పోలేదు. ఆన్లైన్ గేమింగ్, డిజిటల్ వ్యసనం వల్ల కలిగే కనిపించని మానసిక ఒత్తిడే వారి ప్రాణాలను తీసింది” అని ఆవేదన వ్యక్తం చేశారు.

చిన్న వయసులోనే మొబైల్ ఫోన్లు, గేమింగ్ యాప్‌లు పిల్లల మానసిక ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయని, తల్లిదండ్రులు దీనిని తేలికగా తీసుకోకూడదని ఆయన హెచ్చరించారు. గతంలో కూడా ఈ డిజిటల్ వ్యసనంపై తాను పోరాటం చేశానని, అయినప్పటికీ ఇలాంటి ఘటనలు పునరావృతం కావడం బాధాకరమని సోనూసూద్ తెలిపారు. “దయచేసి పిల్లలను సోషల్ మీడియా, ఆన్లైన్ గేమింగ్‌కు వీలైనంతవరకూ దూరంగా ఉంచండి. మరోసారి ఇలాంటి ఘటన జరగకముందే అప్రమత్తం కావాలి” అంటూ ఆయన చేసిన విజ్ఞప్తి ప్రస్తుతం దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. ఈ ఘటన తల్లిదండ్రులకు హెచ్చరికగా నిలవాల్సిన అవసరం ఉందని, పిల్లల భవిష్యత్తు కోసం ఇప్పుడే చర్యలు తీసుకోవాల్సిన సమయం వచ్చిందని సోనూసూద్ స్పష్టంగా సందేశమిచ్చారు.
Amaravati Andhra pradesh Andhrapradesh AndhraPradeshNews APGovernment APNews APPolitics Breaking news BreakingNews BusinessNews Chandrababu naidu ChandrababuNaidu CricketNews CrimeNews Geopolitics Government India IndiaNews LawAndOrder Naralokesh News news24 newsalert NewsToday NewsUpdate NewsUpdates PoliceInvestigation PoliticalUpdate PublicSafety shivasakthi shivasakthienterprises shivasakthimedia shivasakthi net shivasakthinet shivasakthi news shivasakthinews Tdp Telangana TelanganaNews TeluguCinema TeluguNews Tollywood Toofan TrendingNow WorldNews




















