బిహార్ రాజకీయాల్లో కీలక పరిణామం చోటుచేసుకుంది. జేడీయూ అధ్యక్షుడు, బిహార్ ముఖ్యమంత్రి నీతీశ్ కుమార్ త్వరలో రాజ్యసభకు వెళ్లనున్నట్లు ప్రకటించారు. ఈ విషయాన్ని ఆయన స్వయంగా తన ఎక్స్ (ట్విట్టర్) ఖాతా ద్వారా వెల్లడించడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమైంది. దీంతో ఆయన త్వరలోనే ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేసే అవకాశం ఉందని భావిస్తున్నారు.
తన పోస్టులో నీతీశ్ కుమార్ మాట్లాడుతూ గత రెండు దశాబ్దాలుగా ప్రజలు తనపై ఉంచిన విశ్వాసం వల్లే బిహార్ అభివృద్ధిలో కొత్త ప్రమాణాలు నెలకొల్పగలిగామని తెలిపారు. పార్లమెంటరీ జీవితాన్ని ప్రారంభించినప్పటి నుంచే రాష్ట్ర స్థాయిలో రెండు చట్టసభలకు, అలాగే పార్లమెంట్‌లోని రెండు సభలకు ప్రాతినిధ్యం వహించాలని తనకు కోరిక ఉందని చెప్పారు. అందుకే త్వరలో జరగనున్న ఎన్నికల్లో రాజ్యసభ సభ్యుడిగా తన ప్రయాణాన్ని ప్రారంభించాలని నిర్ణయించుకున్నట్లు వెల్లడించారు.
అలాగే కొత్త బాధ్యతలు చేపట్టిన తర్వాత కూడా బిహార్‌తో తన బంధం కొనసాగుతుందని ఆయన స్పష్టం చేశారు. రాష్ట్రంలో ఏర్పడే కొత్త ప్రభుత్వానికి తాను పూర్తి మద్దతు అందిస్తానని తెలిపారు. ఇదిలా ఉండగా దేశవ్యాప్తంగా 37 రాజ్యసభ స్థానాలకు మార్చి 16న ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలోనే నీతీశ్ కుమార్ ఈరోజే రాజ్యసభకు నామినేషన్ దాఖలు చేయనున్నట్లు సమాచారం.
నీతి శ్ రాజ్యసభకు వెళ్లే పరిస్థితిలో బిహార్‌కు కొత్త ముఖ్యమంత్రి ఎంపికపై చర్చ మొదలైంది. ఈ పదవికి భాజపా నేతలు సామ్రాట్ చౌధరీ, విజయ్‌కుమార్ సిన్హా, దిలీప్ జాయస్‌వాల్, సంజీవ్ చౌరాసియా, నిత్యానంద్ రాయ్ పేర్లు వినిపిస్తున్నాయి. కేవలం నాలుగు నెలల క్రితమే నీతీశ్ కుమార్ బిహార్ ముఖ్యమంత్రిగా పదోసారి బాధ్యతలు స్వీకరించిన విషయం తెలిసిందే. ఇప్పుడు ఆయన రాజ్యసభకు వెళ్లే నిర్ణయం రాష్ట్ర రాజకీయాల్లో కొత్త పరిణామాలకు దారితీసే అవకాశం ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు.
Andhra pradesh Andhrapradesh APNews BreakingNews Breaking news BusinessNews CricketNews CrimeNews EducationNews EntertainmentNews Geopolitics Government Hyderabad India IndianCinema IndiaNews InternationalNews LatestNews MarketUpdate MovieNews News NewsUpdate PoliticalNews shivasakthi shivasakthienterprises shivasakthimedia shivasakthi net shivasakthinet shivasakthi news shivasakthinews ShivaSakthiUpdates ShivaShaktiMedia ShivaShaktiNews SportsNews StockMarket TechNews Telangana TelanganaNews TeluguCinema TeluguNews Tollywood TrendingNews ViralNews Wellness WorldNews



















