మాతాశిశు సంరక్షణను మరింత బలోపేతం చేసే దిశగా రాష్ట్ర ప్రభుత్వం తల్లీబిడ్డ ఎక్స్‌ప్రెస్ సేవలను విస్తరిస్తోంది. గర్భిణులు, బాలింతలు, నవజాత శిశువులకు సురక్షితమైన రవాణా అందించేందుకు మొత్తం 500 వాహనాలను అందుబాటులోకి తీసుకురానున్నారు.
తొలి విడతలో సిద్ధమైన 300 అధునాతన వాహనాలను విజయవాడ నుంచి ఆదివారం రాష్ట్రంలోని వివిధ జిల్లాలకు తరలించారు. ప్రయాణికుల భద్రతకు ప్రాధాన్యమిస్తూ ఆరు ఎయిర్‌బ్యాగ్స్, అత్యవసర సమయంలో మహిళలకు వెంటనే సహాయం అందించేందుకు ఎమర్జెన్సీ బటన్, అగ్నిప్రమాదాల సమయంలో రక్షణ చర్యలు చేపట్టే సదుపాయాలను ఏర్పాటు చేశారు.
అంతేకాకుండా జీపీఎస్ లొకేషన్ ట్రాకింగ్ ద్వారా వాహనాల కదలికలను పర్యవేక్షించేలా వ్యవస్థను రూపొందించారు. పల్నాడు జిల్లా నరసరావుపేటలో మంగళవారం నిర్వహించనున్న కార్యక్రమంలో వైద్యారోగ్యశాఖ మంత్రి సత్యకుమార్ ఈ వాహనాలను ప్రారంభించనున్నారు.
Andhra pradesh Andhrapradesh APNews BreakingNews Breaking news BusinessNews CricketNews CrimeNews EducationNews EntertainmentNews Geopolitics Government Hyderabad India IndianCinema IndiaNews InternationalNews LatestNews MarketUpdate MovieNews News NewsToday NewsUpdate PoliticalNews shivasakthi shivasakthienterprises shivasakthimedia shivasakthi net shivasakthinet shivasakthi news shivasakthinews ShivaSakthiUpdates ShivaShaktiMedia ShivaShaktiNews SportsNews StockMarket TechNews Telangana TelanganaNews TeluguCinema TeluguNews Tollywood TrendingNews ViralNews WorldNews



















