స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖ వెబ్‌సైట్‌తో పాటు అనుబంధ ఆన్‌లైన్ సేవలకు సంబంధించిన సర్వర్ నిర్వహణ పనుల కారణంగా ఈ నెల 26, 27, 28 తేదీల్లో సేవలకు అంతరాయం కలుగుతుందని శాఖ ఇన్‌స్పెక్టర్ జనరల్ రాజీవ్‌గాంధీ హనుమంతు తెలిపారు.
ఆన్‌లైన్ వ్యవస్థలను మరింత సజావుగా పనిచేసేలా చేయడం, భద్రతా ప్రమాణాలను బలోపేతం చేయడం, సేవల నాణ్యతను మెరుగుపరచడం లక్ష్యంగా ఈ సర్వర్ నిర్వహణ చర్యలు చేపట్టినట్లు ఆయన వివరించారు.
26వ తేదీ మొహర్రం, 28వ తేదీ ఆదివారం ప్రభుత్వ సెలవులు కావడంతో ఆ రోజుల్లో సేవలు నిలిచిపోతాయని చెప్పారు. అయితే 27వ తేదీ పనిదినం అయినప్పటికీ ఆ ఒక్కరోజు రిజిస్ట్రేషన్ సేవలకు అంతరాయం కలుగుతుందని స్పష్టం చేశారు.
29వ తేదీ నుంచి అన్ని సేవలు యథావిధిగా పునఃప్రారంభమవుతాయని ఆయన వెల్లడించారు. ప్రజలు దీనిని గమనించి తమ అవసరమైన పనులను ముందుగానే పూర్తిచేసుకోవాలని సూచించారు.
Andhra pradesh Andhrapradesh APNews BreakingNews Breaking news BusinessNews CricketNews CrimeNews EducationNews EntertainmentNews Geopolitics Government Hyderabad India IndianCinema IndiaNews InternationalNews LatestNews MarketUpdate MovieNews News NewsUpdate PoliticalNews shivasakthi shivasakthienterprises shivasakthimedia shivasakthi net shivasakthinet shivasakthi news shivasakthinews ShivaSakthiUpdates ShivaShaktiMedia ShivaShaktiNews SportsNews StockMarket TechNews Telangana TelanganaNews TeluguCinema TeluguNews Tollywood TrendingNews ViralNews Wellness WorldNews



















