అమెరికా–ఇజ్రాయెల్ దాడుల్లో మరణించినట్లు పేర్కొన్న ఇరాన్ మాజీ సుప్రీం లీడర్ ఆయతుల్లా అలీ ఖమేనీ అంత్యక్రియలను ప్రభుత్వ లాంఛనాలతో నిర్వహించేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి. ఈ పరిణామాల మధ్య ఆయన కుమారుడు మొజ్తాబా ఖమేనీపై అంతర్జాతీయంగా దృష్టి కేంద్రీకృతమైంది.
యుద్ధ పరిస్థితులు ప్రారంభమైన తర్వాత నుంచి బహిరంగంగా కనిపించని మొజ్తాబా ఖమేనీ, తండ్రి అంత్యక్రియల్లో పాల్గొంటారా అనే ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. రహస్య ప్రాంతంలో ఉన్న ఆయన ఆరోగ్య పరిస్థితిపై కూడా అనేక ఊహాగానాలు కొనసాగుతున్నాయి.
గతంలో టెహ్రాన్‌లోని సుప్రీం లీడర్ కాంపౌండ్‌పై జరిగిన దాడుల్లో మొజ్తాబా తీవ్రంగా గాయపడ్డారని, ఆయనకు కాలికి తీవ్ర గాయం మరియు ముఖానికి కాలిన గాయాలు ఉన్నాయని ఇరాన్ మీడియా పేర్కొంది. అప్పటి నుంచి ఆయనను రహస్య ప్రాంతంలో ఉంచి చికిత్స అందిస్తున్నట్లు వార్తలు వచ్చాయి.
ప్రభుత్వ కీలక వ్యవహారాల్లో మొజ్తాబా పేరు తరచూ వినిపిస్తున్నప్పటికీ, ఆయన ప్రత్యక్షంగా కనిపించకపోవడం అనుమానాలకు దారితీస్తోంది. ప్రభుత్వ ప్రకటనలు కూడా ఆయన పేరుతోనే వెలువడుతున్నట్లు సమాచారం.
అలీ ఖమేనీ మరణం అనంతరం మొజ్తాబా ఖమేనీని సుప్రీం లీడర్‌గా ఎన్నుకున్నట్లు కూడా ప్రచారం ఉంది. అయితే ఆయన ఇప్పటికీ బహిరంగంగా కనిపించకపోవడంతో ఈ నెలలో జరిగే అంత్యక్రియల్లో ఆయన హాజరు కీలకంగా మారింది.
జులై 5 నుంచి 9 వరకు అంత్యక్రియల కార్యక్రమాలు జరగనున్నాయి. టెహ్రాన్, ఖోమ్ నగరాల్లో ప్రారంభ కార్యక్రమాలు నిర్వహించనున్నారు. 9వ తేదీన మషాద్‌లో ఖననం చేసే అవకాశం ఉంది.
ఇక ఈ కార్యక్రమానికి భారత ప్రధాని నరేంద్ర మోదీని ఇరాన్ అధ్యక్షుడు ఆహ్వానించినట్లు సమాచారం. అయితే దీనిపై అధికారిక ధృవీకరణ రావాల్సి ఉంది. ప్రస్తుతం మధ్యప్రాచ్యంలో కొనసాగుతున్న ఉద్రిక్తతల నేపథ్యంలో ఈ అంత్యక్రియలు యథావిధిగా జరుగుతాయా లేదా వాయిదా పడతాయా అన్నది ఇంకా స్పష్టత లేదు.
Andhra pradesh Andhrapradesh APNews BreakingNews Breaking news BusinessNews CricketNews CrimeNews Crime News EducationNews EntertainmentNews Geopolitics Government Hyderabad India IndianCinema IndiaNews InternationalNews LatestNews MarketUpdate MovieNews News NewsUpdate PoliticalNews shivasakthi shivasakthienterprises shivasakthimedia shivasakthi net shivasakthinet shivasakthi news shivasakthinews ShivaSakthiUpdates ShivaShaktiNews SportsNews StockMarket TechNews Telangana TelanganaNews TeluguCinema TeluguNews Tollywood TrendingNews ViralNews Wellness WorldNews



















