పాకిస్థాన్‌లోని లాహోర్ నగరంలో దారుణ ఘటన చోటుచేసుకుంది. నిర్మాణంలో ఉన్న భవనంలో ఏర్పాటు చేసిన ఒక ప్రైవేట్ ట్యూషన్ పైకప్పు అకస్మాత్తుగా కూలిపోవడంతో దాదాపు 14 మంది చిన్నారులు మృతి చెందారు. మరో 20 మంది పిల్లలు గాయాలపాలయ్యారు.
పోలీసుల వివరాల ప్రకారం ఈ ఘటన మంగళవారం జరిగింది. రద్దీగా ఉండే కాహ్నా నౌ ప్రాంతంలో ఉన్న ఈ ట్యూషన్ సెంటర్‌కు 7 నుంచి 13 ఏళ్ల మధ్య వయసున్న సుమారు 30 మంది చిన్నారులు హాజరవుతారు. పైకప్పు ఒక్కసారిగా కూలిపోవడంతో పిల్లలందరూ శిథిలాల కింద చిక్కుకుపోయారు.
ఇప్పటివరకు 14 మంది చిన్నారుల మృతదేహాలను వెలికితీశామని లాహోర్ డీఐజీ తెలిపారు. గాయపడిన వారిని స్థానిక ఆసుపత్రులకు తరలించి చికిత్స అందిస్తున్నారు. సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. ఈ ఘటనతో ప్రాంతమంతా విషాదంలో మునిగిపోయింది.
Andhra pradesh Andhrapradesh APNews BreakingNews Breaking news BusinessNews CricketNews CrimeNews Crime News EducationNews EntertainmentNews Geopolitics Government Hyderabad India IndianCinema IndiaNews InternationalNews LatestNews MarketUpdate MovieNews News NewsUpdate PoliticalNews shivasakthi shivasakthienterprises shivasakthimedia shivasakthi net shivasakthinet shivasakthi news shivasakthinews ShivaSakthiUpdates ShivaShaktiNews SportsNews StockMarket TechNews Telangana TelanganaNews TeluguCinema TeluguNews Tollywood TrendingNews ViralNews Wellness WorldNews



















