హర్మూజ్ జలసంధి వద్ద ఉద్రిక్తతలు మరింత పెరిగాయి. పలు నౌకలపై ఇరాన్ దాడులు చేసిందని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆరోపించారు. ఇది కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించడమేనని ఆయన వ్యాఖ్యానించారు.హర్మూజ్ జలసంధి మూసివేత కారణంగా ఇరాన్ రోజుకు సుమారు 500 మిలియన్ డాలర్లు (సుమారు రూ.4,600 కోట్లు) నష్టపోతుందని ట్రంప్ పేర్కొన్నారు. అయితే అమెరికాకు ఎలాంటి ఆర్థిక నష్టం లేదని ఆయన స్పష్టం చేశారు.
ఇరాన్‌తో శాంతి చర్చల కోసం అమెరికా ప్రతినిధులు సోమవారం పాకిస్థాన్‌కు చేరుకోనున్నారని ట్రంప్ తెలిపారు. “మేము న్యాయమైన, సహేతుకమైన ఒప్పందాన్ని ఇరాన్ ముందుంచాం. దానిని వారు అంగీకరిస్తారని ఆశిస్తున్నాం” అని ఆయన చెప్పారు.
అంగీకరించని పక్షంలో ఇరాన్‌లోని విద్యుత్ కేంద్రాలు, వంతెనలను లక్ష్యంగా చేసుకుంటామని ట్రంప్ తీవ్ర హెచ్చరికలు జారీ చేశారు. ఇకపై తాను ‘మంచివాడిలా ఉండను’ అని వ్యాఖ్యానిస్తూ, ఇరాన్ యంత్రాంగానికి ముగింపు పలకాల్సిన సమయం వచ్చిందని ఆయన అన్నారు.మరోవైపు, ఇరాన్ ఈ ఆరోపణలను తీవ్రంగా ఖండించింది. తమ హక్కులను హరించే అధికారం ట్రంప్‌కు లేదని స్పష్టం చేసింది. అమెరికా అనవసరమైన డిమాండ్లు చేసిందని, అందుకే పాకిస్థాన్‌లో జరిగిన మొదటి విడత శాంతి చర్చలు విఫలమయ్యాయని ఇరాన్ ఆరోపించింది.
Andhra pradesh Andhrapradesh APNews BreakingNews Breaking news BusinessNews CricketNews CrimeNews EducationNews EntertainmentNews Geopolitics Government India IndianCinema IndiaNews InternationalNews LatestNews MarketUpdate MovieNews News NewsToday NewsUpdate PoliticalNews PublicSafety shivasakthi shivasakthienterprises shivasakthimedia shivasakthi net shivasakthinet shivasakthi news shivasakthinews ShivaSakthiUpdates ShivaShaktiMedia ShivaShaktiNews SportsNews StockMarket TechNews Telangana TelanganaNews TeluguCinema TeluguNews Tollywood TrendingNews ViralNews WorldNews



















