పెట్రోల్, డీజిల్ ధరలు పెరగనున్నాయన్న వార్తలను కేంద్ర ప్రభుత్వం ఖండించింది. అసెంబ్లీ ఎన్నికల అనంతరం లీటరుకు రూ.25–28 వరకు ధరలు పెరగవచ్చని వచ్చిన కొన్ని మీడియా కథనాలు పూర్తిగా అవాస్తవమని స్పష్టం చేసింది.
కేంద్ర పెట్రోలియం మంత్రిత్వ శాఖ ‘ఎక్స్’ వేదికగా స్పందిస్తూ, ప్రస్తుతం ఇంధన ధరల పెంపు గురించి ఎలాంటి ప్రతిపాదన పరిశీలనలో లేదని తెలిపింది. ప్రజల్లో గందరగోళం సృష్టించే రూమర్లను నమ్మవద్దని సూచించింది.
అంతర్జాతీయంగా ముడి చమురు ధరలు పెరుగుతున్నప్పటికీ, గత నాలుగేళ్లుగా దేశంలో పెట్రోల్, డీజిల్ ధరల్లో పెద్ద మార్పులు చేయలేదని కేంద్రం గుర్తు చేసింది. ప్రస్తుతం బ్యారెల్ ముడి చమురు ధర 100 డాలర్లకు పైగా ఉన్నా, ప్రజలపై అదనపు భారం పడకుండా ప్రభుత్వం, చమురు సంస్థలు చర్యలు తీసుకుంటున్నాయని పేర్కొంది.
Andhra pradesh Andhrapradesh APNews BreakingNews Breaking news BusinessNews CricketNews CrimeNews EducationNews EntertainmentNews Geopolitics Government India IndianCinema IndiaNews InternationalNews LatestNews MarketUpdate MovieNews News NewsToday NewsUpdate PoliticalNews PublicSafety shivasakthi shivasakthienterprises shivasakthimedia shivasakthi net shivasakthinet shivasakthi news shivasakthinews ShivaSakthiUpdates ShivaShaktiMedia ShivaShaktiNews SportsNews StockMarket TechNews Telangana TelanganaNews TeluguCinema TeluguNews Tollywood TrendingNews ViralNews WorldNews


















