అనగనగా ఒక రాజు తన రాజ్య పర్యటనలో భాగంగా గుర్రాల బజారుకు వెళ్లాడు. అక్కడున్న వ్యాపారస్తులందరూ తమ గుర్రాల గొప్పతనాన్ని చాటుతూ రాజును ఆకట్టుకోవడానికి పోటీ పడ్డారు.
“నా గుర్రం మీ మాటే వింటుంది ”, “నా గుర్రం గాలిలా పరిగెడుతుంది”, “దానికి భయం తెలియదు” అంటూ ఒక్కొక్కరు పొగిడారు.
అందులో ఒకడు అతిగా మాట్లాడుతూ,
“మహారాజా! నా గుర్రం ఎగరగలదు!” అన్నాడు. ఆ మాట రాజు చెవిలో బలంగా పడింది. వెంటనే ఆ గుర్రాన్ని కొనుగోలు చేసి మహాలుకు తీసుకెళ్లాడు. మరుసటి రోజు సేనాధిపతిని పిలిచి గుర్రాన్ని ఎగిరించమన్నాడు. కానీ గుర్రం ఎగరలేదు. వ్యాపారస్తుడిని పిలిపించి ప్రశ్నించగా,
“ఎగురుతుంది అంటే చాలా వేగంగా పరిగెడుతుందని నా ఉద్దేశ్యం మహారాజా!” అన్నాడు.
రాజు కోపంతో అతన్ని శిక్షించాడు.
తరువాత ప్రధాన మంత్రిని పిలిచి, గుర్రాన్ని ఎగరమన్నాడు. ఆయన కూడా అది అసాధ్యమని చెప్పగానే శిక్షించాడు. ఇలా రోజులు గడుస్తూ ఉండగా, చివరకు ఒక సభికుడిని పిలిచి అదే ఆజ్ఞ ఇచ్చాడు. సభికుడు తలవంచి,
“మహారాజా! నాకు ఒక సంవత్సరం గడువు ఇవ్వండి. నేను గుర్రాన్ని ఎగిరించడానికి ప్రయత్నిస్తాను,” అన్నాడు. రాజు సంతోషించి అంగీకరించాడు. ఇంటికి వెళ్లిన సభికుడిని అందరూ ఆశ్చర్యంగా ప్రశ్నించారు. అతని భార్య కూడా ఆందోళనగా అడిగింది – “ఇది ఎలా సాధ్యం?” అతను చిరునవ్వుతో చెప్పాడు –
“మూర్ఖుడి పట్టుదలతో వాదించడం కష్టం. వెంటనే ‘కాదు’ అన్నా నా తల కూడా పోయేది. ఒక సంవత్సరం గడువు అడిగితే ముందున్న ప్రమాదం తప్పింది. ఈ ఏడాదిలో ఏమైనా జరగొచ్చు. రాజు ఈ విషయం మరిచిపోవచ్చు… లేకపోతే రాజు మారిపోవచ్చు… లేదంటే పరిస్థితులు మారవచ్చు. భవిష్యత్తు ఎవరికీ తెలియదు.
రాజులు మారెనో… గుర్రాలు ఎగిరెనో!”
నీతి:
సమయోచితంగా ఆలోచించి మాట్లాడటం ప్రాణాలను కాపాడుతుంది. కొన్ని సందర్భాల్లో తెలివిగా గడువు తీసుకోవడం కూడా ఒక గొప్ప పరిష్కారం.
Andhra pradesh Andhrapradesh APNews BreakingNews Breaking news BusinessNews CricketNews CrimeNews EducationNews EntertainmentNews Geopolitics Government Hyderabad India IndianCinema IndiaNews InternationalNews LatestNews MarketUpdate MovieNews News NewsUpdate PoliticalNews shivasakthi shivasakthienterprises shivasakthimedia shivasakthi net shivasakthinet shivasakthi news shivasakthinews ShivaSakthiUpdates ShivaShaktiMedia ShivaShaktiNews SportsNews StockMarket TechNews Telangana TelanganaNews TeluguCinema TeluguNews Tollywood TrendingNews ViralNews Wellness WorldNews



















