భువనగిరి రాజ్యాన్ని ఇంద్రవర్మ పాలించేవాడు. తన దగ్గర ఉండే మంత్రి.. వృద్ధాప్య సమస్యలతో విధుల నుంచి తప్పుకొన్నాడు. దాంతో మరో మంత్రిని ఎన్నుకోవడానికి పోటీలు నిర్వహించాడు మహారాజు. రెండు పరీక్షల్లో నెగ్గి.. అజేయుడు, విజేయుడు చివరి దశకు చేరుకున్నారు. రాజు వారిద్దరికీ చెరో వంద బంగారు నాణేలు ఇచ్చి.. ‘వీటిని ఉపయోగించి ఎవరైతే అత్యంత విలువైన వస్తువును తీసుకొస్తారో వారే పరీక్షలో విజయం సాధించినట్లు. దానికి మీకు రెండు రోజుల సమయం ఇస్తున్నాను’ అని చెప్పాడు. విజేయుడు వెంటనే బయలుదేరి పొరుగు రాజ్యానికి వెళ్లాడు. ఆ వంద నాణేలతో.. మాట్లాడే అరుదైన పక్షిని కొన్నాడు. మరుసటిరోజే దాన్ని తెచ్చి.. ‘మహారాజా! ఇది చలాకీగా మాట్లాడుతూ మీకు వినోదాన్ని ఇస్తుంది. ఇలాంటి పక్షి ఈ చుట్టుపక్కల ఎక్కడా దొరకదు’ అని చెప్పి ఇచ్చాడు. ఎలాగైనా తానే గెలుస్తాననే ఆనందంలో ఉన్నాడు విజేయుడు. రెండు రోజుల తరవాత ఖాళీ చేతులతో సభకు వచ్చాడు అజేయుడు. ‘అదేంటి నువ్వు ఏమీ తీసుకురాలేదు?’ అని అడిగాడు ఇంద్రవర్మ. ‘మహారాజా! నేను ఆ నాణేలతో ఎండిపోయిన ఒక పాత చెరువును బాగు చేయించాను. ఈసారి వర్షాకాలంలో వానలకు అది నిండి.. చుట్టుపక్కల ఉండే పొలాలకు నీరందిస్తుంది. ఆ నీటిని చూసి రైతుల ముఖాల్లో వచ్చే చిరునవ్వునే, మీకు బహుమతిగా ఇవ్వాలనుకున్నాను’ అన్నాడు అజేయుడు. అప్పుడు మహారాజు.. ‘సొంత ప్రయోజనాల కోసం ఆలోచించే నాయకులు ఎప్పుడూ రాజ్యాభివృద్ధికి తోడ్పడలేరు. ప్రజల గురించి ఆలోచించిన వాళ్లే అసలైన నాయకులు. ప్రజల సంక్షేమమే మంత్రి మొదటి బాధ్యత.. కాబట్టి అజేయుడే మంత్రి పదవికి అర్హుడు’ అని ప్రకటించాడు. తరవాత అతణ్ని సన్మానించి, విధుల్లో చేర్చుకున్నాడు. దాంతో సభలో ఉన్నవాళ్లంతా అజేయుణ్ని అభినందించారు.
Andhra pradesh Andhrapradesh APNews BreakingNews Breaking news BusinessNews CricketNews CrimeNews EducationNews EntertainmentNews Geopolitics Government India IndianCinema IndiaNews InternationalNews LatestNews MarketUpdate MovieNews News NewsToday NewsUpdate PoliticalNews PublicSafety shivasakthi shivasakthienterprises shivasakthimedia shivasakthi net shivasakthinet shivasakthi news shivasakthinews ShivaSakthiUpdates ShivaShaktiMedia ShivaShaktiNews SportsNews StockMarket TechNews Telangana TelanganaNews TeluguCinema TeluguNews Tollywood TrendingNews ViralNews WorldNews



















