Vijayanagara districtలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. జాతీయ రహదారిపై వేగంగా దూసుకెళ్లిన truck అదుపుతప్పి ముందున్న ఆరు వాహనాలను ఢీకొట్టి బోల్తా పడింది. ఈ ఘటనలో నలుగురు ప్రాణాలు కోల్పోగా, 18 మంది తీవ్రంగా గాయపడ్డారు.పోలీసుల వివరాల ప్రకారం, దిల్లీ నుంచి బెంగళూరు వైపు వెళ్తున్న సిమెంట్ లోడు లారీ మరియమ్మనహళ్లి సమీపంలో అదుపుతప్పింది. ముందు వెళ్తున్న మూడు బైకులు, ఒక కారు, ఒక సరకు వాహనం, ఆర్టీసీ బస్సును ఢీకొట్టింది. అనంతరం రోడ్డుపక్కన ఉన్న గొయ్యిలో బోల్తాపడింది.
మృతుల్లో ఒకే కుటుంబానికి చెందిన సుజాత (40), ఆమె తండ్రి నాగప్ప (75), సోదరుడు కొట్రేశ్ (22)తో పాటు మరో వ్యక్తి దురుగప్ప (55) ఉన్నారు. గాయపడిన వారిని సమీప ప్రభుత్వ ఆసుపత్రులకు తరలించి చికిత్స అందిస్తున్నారు.లారీ డ్రైవర్‌ను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారణ ప్రారంభించారు. ఘటనపై Karnataka Police దర్యాప్తు కొనసాగిస్తోంది. రోడ్డు ప్రమాదం కారణంగా ప్రాంతంలో తీవ్ర విషాదం నెలకొంది.
Andhra pradesh Andhrapradesh APNews BreakingNews Breaking news BusinessNews CricketNews CrimeNews EducationNews EntertainmentNews Geopolitics Government Hyderabad India IndianCinema IndiaNews InternationalNews LatestNews MarketUpdate MovieNews News NewsUpdate PoliticalNews shivasakthi shivasakthienterprises shivasakthimedia shivasakthi net shivasakthinet shivasakthi news shivasakthinews ShivaSakthiUpdates ShivaShaktiMedia ShivaShaktiNews SportsNews StockMarket TechNews Telangana TelanganaNews TeluguCinema TeluguNews Tollywood TrendingNews ViralNews Wellness WorldNews



















