కార్పొరేట్ ప్రపంచంలో విజయాన్ని నిర్ణయించేది కేవలం వ్యక్తిగత ప్రతిభ మాత్రమే కాదు. ఒక జట్టుగా కలిసి పనిచేసే సహకార దృక్పథమే ఉద్యోగి ఎదుగుదలకు కీలకమైన అంశం. సహోద్యోగుల విజయాన్ని ప్రోత్సహిస్తూ, కలిసి ముందుకు సాగినప్పుడే సంస్థలు మెరుగైన ఫలితాలను సాధిస్తాయి. జట్టు విజయం సాధించినప్పుడే సంస్థ అభివృద్ధి చెందుతుంది. ఈ భావనతో పనిచేసే ఉద్యోగుల విలువ సంస్థలో మరింత పెరుగుతుంది.
ఏ సంస్థ అయినా అనేక మంది ఉద్యోగుల సమిష్టి కృషితో ముందుకు సాగుతుంది. ఒక్కరి ప్రతిభతో సంస్థ ఎదగదు. సమష్టి బాధ్యతతో పనిచేసినప్పుడే సంస్థలు విజయాన్ని అందుకుంటాయి. ఉద్యోగ జీవితంలో వ్యక్తిగత ప్రతిభ కంటే జట్టుగా కలిసి సంస్థ లక్ష్యాలను సాధించడం ముఖ్యమవుతుంది.
ఒక సాఫ్ట్‌వేర్ సంస్థలో ట్రెయినీలుగా చేరిన సుధీర్, స్వప్న ఉదాహరణ దీనికి నిదర్శనం. స్వప్నకు సాంకేతిక నైపుణ్యం తక్కువగా ఉండటంతో తరచూ పనిలో చిన్న పొరపాట్లు జరిగేవి. ఇతరులు విమర్శించినప్పటికీ సుధీర్ ఆమెకు సహాయం చేస్తూ అవసరమైన నైపుణ్యాలను నేర్పించాడు. ఒక ముఖ్యమైన క్లయింట్‌కు ఇవ్వాల్సిన ప్రజెంటేషన్‌ను ఆమెతో కలిసి విజయవంతంగా పూర్తి చేశాడు. ఫలితంగా యాజమాన్యం సుధీర్‌ను సహకార భావనతో పనిచేసే ఉద్యోగిగా గుర్తించి అభినందించింది.
పలు అంతర్జాతీయ అధ్యయనాలు కూడా ఇదే విషయాన్ని చెబుతున్నాయి. స్టాన్‌ఫోర్డ్ విశ్వవిద్యాలయం నిర్వహించిన పరిశోధన ప్రకారం కలిసి పనిచేసే బృందాలు కష్టమైన పనులపై 64 శాతం ఎక్కువ సమయం కేటాయించి మెరుగైన ఫలితాలు సాధిస్తున్నాయి. గూగుల్ చేపట్టిన ‘ప్రాజెక్ట్ అరిస్టాటిల్’లో జట్టు సభ్యులు భయపడకుండా తమ అభిప్రాయాలను చెప్పగలిగే మానసిక భద్రత ఉన్నప్పుడు బృందాల పనితీరు గణనీయంగా పెరుగుతుందని వెల్లడైంది. అలాగే ‘మెకిన్సే’ నివేదిక ప్రకారం సంస్థల్లో జ్ఞానాన్ని పరస్పరం పంచుకోవడం వల్ల ఉత్పాదకత 20 నుంచి 25 శాతం వరకు పెరుగుతుంది.
ఈ సహకార దృక్పథాన్ని అలవరచుకోవడానికి కొన్ని అలవాట్లు అవసరం. సహోద్యోగులు సమస్యను వివరించినప్పుడు పూర్తిగా వినడం, మీరు నేర్చుకున్న విషయాలనుజట్టు సభ్యులతో పంచుకోవడం, ప్రాజెక్టు విజయాన్ని సమష్టి బాధ్యతగా భావించడం ముఖ్యమైన అంశాలు.
ఒంటరి ప్రతిభ కొంతదూరం వరకు మాత్రమే తీసుకెళ్తుంది. కానీ సహకార భావనతో పనిచేసే వ్యక్తులు మాత్రం జట్టును ముందుకు నడిపిస్తూ శిఖరాగ్ర విజయాలను అందుకుంటారు.
అయితే సహకారం లేకపోతే ప్రతిభ ఉన్నా ప్రయోజనం ఉండదు. రోహన్ అనే ఉద్యోగి దీనికి ఉదాహరణ.కాలేజీలో టాప్ ర్యాంకర్‌గా పేరు తెచ్చుకున్న రోహన్ తన ప్రతిభపై గట్టి నమ్మకం పెట్టుకున్నాడు. సహోద్యోగులు సహాయం కోరితే నిర్లక్ష్యంగా స్పందిస్తూ, వారి ఆలోచనలను తక్కువ చేసి మాట్లాడేవాడు. సమావేశాల్లో ఇతరుల తప్పులను బహిరంగంగా విమర్శించడంతో జట్టు సభ్యుల ఆత్మవిశ్వాసం తగ్గింది.
రోహన్ తన పనిని వేగంగా పూర్తి చేసినప్పటికీ జట్టు సభ్యులు వెనకబడిపోవడంతో ప్రాజెక్ట్ గడువులోగా పూర్తికాలేదు. వ్యక్తిగత నైపుణ్యం ఉన్నప్పటికీ జట్టును ముందుకునడిపించే సహకార దృక్పథం లేకపోవడంతో అతడిని మేనేజ్‌మెంట్ టీమ్ ప్లేయర్‌గా గుర్తించలేదు. వార్షిక పనితీరు మదింపులో పదోన్నతి కూడా నిరాకరించింది.
ఈ ఉదాహరణ ఒక ముఖ్యమైన సందేశాన్ని ఇస్తుంది. కార్పొరేట్ ప్రపంచంలో విజయానికి ఒంటరి ప్రతిభ సరిపోదు. సహకార దృక్పథంతో జట్టుగా పనిచేసినప్పుడే నిజమైన ఎదుగుదల సాధ్యమవుతుంది.
Andhra pradesh Andhrapradesh APNews BreakingNews Breaking news BusinessNews CricketNews CrimeNews EducationNews EntertainmentNews Geopolitics Government Hyderabad India IndianCinema IndiaNews InternationalNews LatestNews MarketUpdate MovieNews News NewsUpdate PoliticalNews shivasakthi shivasakthienterprises shivasakthimedia shivasakthi net shivasakthinet shivasakthi news shivasakthinews ShivaSakthiUpdates ShivaShaktiMedia ShivaShaktiNews SportsNews StockMarket TechNews Telangana TelanganaNews TeluguCinema TeluguNews Tollywood TrendingNews ViralNews Wellness WorldNews



















