బాసరలో గోదావరి నదిలో పుణ్యస్నానం ఆచరించేందుకు వెళ్లిన ముగ్గురు అన్నదమ్ములు మునిగి మృతి చెందిన ఘటన తీవ్ర విషాదాన్ని నింపింది.
హైదరాబాద్‌లోని కాచిగూడ చప్పల్‌బజార్ ప్రాంతంలో నివసించే చంద్రశేఖర్ (38), రామచందర్ (36), మల్లేశ్ కుమార్ (29)లు కుటుంబాలతో కలిసి బాసరకు వచ్చారు. రామచందర్ పిల్లలకు జ్ఞాన సరస్వతి పుణ్యక్షేత్రంలో అక్షరాభ్యాసం చేయించేందుకు వచ్చిన ఈ కుటుంబం, ఆ తర్వాత గోదావరిలో స్నానం చేయడానికి వెళ్లింది.
భక్తుల రద్దీ ఎక్కువగా ఉండటంతో తక్కువ జనసంచారం ఉన్న ప్రాంతంలో స్నానం చేయాలని ముగ్గురు అన్నదమ్ములు నిర్ణయించుకున్నారు. అయితే నీటి లోతును అంచనా వేయలేక చంద్రశేఖర్ ముందుగా నీటిలోకి వెళ్లి గల్లంతయ్యారు. ఆయనను కాపాడే ప్రయత్నంలో రామచందర్, మల్లేశ్ కుమార్ కూడా నీటిలోకి దిగగా ముగ్గురూ ప్రమాదవశాత్తు మునిగిపోయారు.
సమాచారం అందుకున్న గజ ఈతగాళ్లు, రెస్క్యూ బృందాలు సుమారు నాలుగు గంటలపాటు గాలింపు చర్యలు చేపట్టి ముగ్గురి మృతదేహాలను వెలికితీశారు.
మృతదేహాలను భైంసా ఏఎస్పీ సాయికిరణ్, బాసర సీఐ దీపక్, తహసీల్దార్ పవన్ చంద్ర పర్యవేక్షణలో పోస్టుమార్టం నిమిత్తం భైంసా ప్రాంతీయ ఆసుపత్రికి తరలించారు.
ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు అన్నదమ్ములు ఒకేసారి మృతి చెందడంతో వారి కుటుంబంలో తీవ్ర విషాదం నెలకొంది.
Andhra pradesh Andhrapradesh APNews BreakingNews Breaking news BusinessNews CricketNews CrimeNews EducationNews EntertainmentNews Geopolitics Government India IndianCinema IndiaNews InternationalNews LatestNews MarketUpdate MovieNews News NewsToday NewsUpdate PoliticalNews PublicSafety shivasakthi shivasakthienterprises shivasakthimedia shivasakthi net shivasakthinet shivasakthi news shivasakthinews ShivaSakthiUpdates ShivaShaktiMedia ShivaShaktiNews SportsNews StockMarket TechNews Telangana TelanganaNews TeluguCinema TeluguNews Tollywood TrendingNews ViralNews WorldNews



















