తిరుమల శ్రీవేంకటేశ్వర స్వామివారిని మంత్రి నారా లోకేశ్ గురువారం ఉదయం దర్శించుకున్నారు. వీఐపీ బ్రేక్ దర్శనం సమయంలో ఆయన వైకుంఠం క్యూ కాంప్లెక్స్-1 ద్వారా ఆలయానికి చేరుకున్నారు. అక్కడ తితిదే అదనపు ఈవో వెంకయ్య చౌదరి, ఆలయం వద్ద తితిదే ఛైర్మన్ బీఆర్ నాయుడు, ఈవో ఎం. రవిచంద్ర ఆయనకు ఘన స్వాగతం పలికారు. అనంతరం శ్రీవారి మూలమూర్తిని దర్శించుకునే అవకాశం కల్పించారు.
దర్శనానంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు మంత్రి లోకేశ్‌కు వేదాశీర్వచనం అందించారు. తితిదే ఛైర్మన్ బీఆర్ నాయుడు ఆయనకు శ్రీవారి తీర్థప్రసాదాలు, ఆలయ చిత్రపటాన్ని అందజేసి సత్కరించారు. ఈ ఆధ్యాత్మిక కార్యక్రమం భక్తి భావంతో ప్రశాంత వాతావరణంలో జరిగింది.
తిరుమల దర్శన అనంతరం మంత్రి లోకేశ్ తితిదే బోర్డు సభ్యుడు భానుప్రకాష్‌రెడ్డి కుమార్తె వైష్ణవి, హర్షవర్ధన్‌ల వివాహ వేడుకకు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన నూతన దంపతులకు శుభాకాంక్షలు తెలిపారు.
Andhra pradesh Andhrapradesh APNews BreakingNews Breaking news BusinessNews CricketNews CrimeNews EducationNews EntertainmentNews Geopolitics Government India IndianCinema IndiaNews InternationalNews LatestNews MarketUpdate MovieNews News NewsToday NewsUpdate PoliticalNews PublicSafety shivasakthi shivasakthienterprises shivasakthimedia shivasakthi net shivasakthinet shivasakthi news shivasakthinews ShivaSakthiUpdates ShivaShaktiMedia ShivaShaktiNews SportsNews StockMarket TechNews Telangana TelanganaNews TeluguCinema TeluguNews Tollywood TrendingNews ViralNews WorldNews



















