నటి త్రిషకు సంబంధించిన తాజా వార్తలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అగ్ర కథానాయకులు కమల్ హాసన్ – రజనీకాంత్ కలిసి నటించనున్న భారీ మల్టీస్టారర్ చిత్రంలో త్రిషను ఎంపిక చేసినట్లు గతంలో ప్రచారం జరిగింది. నెల్సన్ దిలీప్‌కుమార్ దర్శకత్వంలో రూపొందనున్న ఈ సినిమాకు సంబంధించి ఆమె భారీ పారితోషికం తీసుకోనున్నట్లు కూడా వార్తలు చక్కర్లు కొట్టాయి.
అయితే తాజాగా తమిళ సినీ వర్గాల్లో వినిపిస్తున్న సమాచారం ప్రకారం, తమిళనాడు ఎన్నికల ఫలితాల తర్వాత త్రిష తన సినిమా ఎంపికల్లో మరింత జాగ్రత్తగా వ్యవహరిస్తున్నారని తెలుస్తోంది. అందులో భాగంగానే ఈ ప్రాజెక్ట్ కోసం రూ.12 కోట్లు ఆఫర్ చేసినప్పటికీ ఆమె నటించేందుకు సుముఖత చూపించడం లేదని ఆంగ్ల మీడియా కథనాలు పేర్కొంటున్నాయి.
కమల్ హాసన్ – రజనీకాంత్ 46 ఏళ్ల తర్వాత కలిసి నటిస్తున్న ఈ ప్రాజెక్ట్‌పై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. వారి స్థాయికి తగిన అగ్ర కథానాయికగా త్రిషను తీసుకోవాలని మేకర్స్ భావించినట్లు సమాచారం. అయితే ఈ ప్రాజెక్ట్‌ను ఉదయనిధి స్టాలిన్‌కు చెందిన రెడ్ జెయింట్ మోషన్ పిక్చర్ నిర్మిస్తుండటంతో, కొన్ని కారణాల వల్ల త్రిష ఈ ఆఫర్‌ను తిరస్కరించినట్లు టాక్ వినిపిస్తోంది. దీనిపై అధికారిక ప్రకటన ఇంకా వెలువడాల్సి ఉంది.
ఇక త్రిష ఇటీవల ‘వీరభద్రుడు’ సినిమాలో లాయర్ ప్రీతిగా మెప్పించారు. ప్రస్తుతం ఆమె చిరంజీవికి జోడీగా ‘విశ్వంభర’ సినిమాలో నటిస్తున్నారు. వశిష్ఠ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సోషియో ఫాంటసీ చిత్రానికి సంబంధించి అత్యాధునిక వీఎఫ్‌ఎక్స్ పనులు జరుగుతున్నాయి. భారీ బడ్జెట్‌తో రూపొందుతున్న ఈ సినిమా కోసం ప్రపంచస్థాయి VFX సంస్థలు పనిచేస్తుండటం విశేషం.
Andhra pradesh Andhrapradesh APNews BreakingNews Breaking news BusinessNews CricketNews CrimeNews EducationNews EntertainmentNews Geopolitics Government Hyderabad India IndianCinema IndiaNews InternationalNews LatestNews MarketUpdate MovieNews News NewsToday NewsUpdate PoliticalNews shivasakthi shivasakthienterprises shivasakthimedia shivasakthi net shivasakthinet shivasakthi news shivasakthinews ShivaSakthiUpdates ShivaShaktiMedia ShivaShaktiNews SportsNews StockMarket TechNews Telangana TelanganaNews TeluguCinema TeluguNews Tollywood TrendingNews ViralNews WorldNews



















