తిరుమల శ్రీవారి అక్టోబర్ నెల ఆర్జిత సేవల టికెట్ల విడుదలకు తిరుమల తిరుపతి దేవస్థానం (తితిదే) షెడ్యూల్‌ను ప్రకటించింది. సుప్రభాతం, తోమాల, అర్చన, అష్టదళ పాదపద్మారాధన సేవలకు సంబంధించిన ఎలక్ట్రానిక్ డిప్ నమోదును జూలై 18 ఉదయం 10 గంటలకు ప్రారంభించనుంది. భక్తులు జూలై 20 ఉదయం 10 గంటల వరకు ఆన్‌లైన్‌లో నమోదు చేసుకునే అవకాశం ఉంటుంది.
ఎలక్ట్రానిక్ లక్కీడిప్‌లో ఎంపికైన భక్తులు జూలై 20 నుంచి 22వ తేదీ మధ్యాహ్నం వరకు టికెట్ మొత్తాన్ని చెల్లించి సేవా టికెట్లను ఖరారు చేసుకోవాల్సి ఉంటుంది. గడువులోగా చెల్లింపు పూర్తి చేయని పక్షంలో ఆ అవకాశం రద్దవుతుందని తితిదే తెలిపింది.
జూలై 21 ఉదయం 10 గంటలకు కల్యాణోత్సవం, ఊంజల్ సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్రదీపాలంకార సేవ, సాలకట్ల పవిత్రోత్సవాల టికెట్ల కోటాను విడుదల చేయనున్నారు. అదే రోజు మధ్యాహ్నం 3 గంటలకు వర్చువల్ సేవలు, వాటికి సంబంధించిన దర్శన స్లాట్ల కోటాను కూడా అందుబాటులో ఉంచనున్నారు.
జూలై 23 ఉదయం 10 గంటలకు అంగప్రదక్షిణం టికెట్లు, ఉదయం 11 గంటలకు శ్రీవాణి ట్రస్టు బ్రేక్ దర్శన కోటాను విడుదల చేస్తారు. మధ్యాహ్నం 3 గంటలకు వృద్ధులు, దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులు, దివ్యాంగుల కోసం ఉచిత ప్రత్యేక ప్రవేశ దర్శన టోకెన్ల కోటాను అందుబాటులో ఉంచనున్నారు.
జూలై 24 ఉదయం 10 గంటలకు రూ.300 ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్ల కోటాను, మధ్యాహ్నం 3 గంటలకు తిరుమల, తిరుపతిలోని అద్దె గదుల బుకింగ్ కోటాను విడుదల చేయనున్నట్లు తితిదే వెల్లడించింది.
భక్తులు అన్ని సేవా టికెట్లు, దర్శన టికెట్లు, వర్చువల్ సేవలు, వసతి గదుల బుకింగ్‌లను తితిదే అధికారిక వెబ్‌సైట్ ద్వారా మాత్రమే చేసుకోవాలని సూచించింది. అధీకృత వెబ్‌సైట్‌లోనే నమోదు చేసుకోవాలని, ఇతర అనధికారిక వెబ్‌సైట్లు లేదా మధ్యవర్తులను నమ్మవద్దని భక్తులకు విజ్ఞప్తి చేసింది.
Andhra pradesh Andhrapradesh APNews BreakingNews Breaking news BusinessNews CricketNews CrimeNews EducationNews EntertainmentNews Geopolitics Government India IndianCinema IndiaNews InternationalNews LatestNews MarketUpdate MovieNews News NewsToday NewsUpdate PoliticalNews PublicSafety shivasakthi shivasakthienterprises shivasakthimedia shivasakthi net shivasakthinet shivasakthi news shivasakthinews ShivaSakthiUpdates ShivaShaktiMedia ShivaShaktiNews SportsNews StockMarket TechNews Telangana TelanganaNews TeluguCinema TeluguNews Tollywood TrendingNews ViralNews WorldNews

















