అమెరికాలో గ్రీన్‌కార్డ్ నిబంధనలపై నెలకొన్న గందరగోళానికి తాజాగా స్పష్టత వచ్చింది. గ్రీన్‌కార్డ్ దరఖాస్తు ప్రక్రియ కొనసాగుతున్న సమయంలో వలసదారులు అమెరికాను విడిచి వెళ్లాల్సిన అవసరం లేదని Department of Homeland Security (DHS) స్పష్టం చేసింది.
ఇటీవల US Citizenship and Immigration Services (USCIS) మే 21న చేసిన ప్రకటనతో తాత్కాలిక వలసదారులు దరఖాస్తు కోసం స్వదేశానికి వెళ్లాల్సి ఉంటుందన్న అభిప్రాయం ఏర్పడి గందరగోళం నెలకొంది. దీనిపై DHS తాజాగా వివరణ ఇచ్చింది.
తాజా ప్రకటనలో DHS ఇది పెద్ద విధాన మార్పు కాదని పేర్కొంది. గ్రీన్‌కార్డ్ ప్రక్రియలో దరఖాస్తుదారు అమెరికాలోనే ఉండాలా లేక స్వదేశానికి వెళ్లాలా అన్నది ఇమిగ్రేషన్ అధికారుల విచక్షణాధికారంపై ఆధారపడి ఉంటుందని తెలిపింది. ఇది ఇప్పటికే అమల్లో ఉన్న నిబంధనలే అని స్పష్టం చేసింది.
అప్లికేషన్ ప్రాసెస్ సమయంలో వలసదారులు సాధారణంగా అమెరికాలో ఉండేందుకు అనుమతి ఉంటుందని కూడా DHS వెల్లడించింది. అయితే వీసా ఓవర్‌స్టేలు, ఇతర ఇమిగ్రేషన్ సంబంధిత అంశాలను అధికారులు పరిగణలోకి తీసుకుంటారని పేర్కొంది.
అయితే ఏ పరిస్థితుల్లో దరఖాస్తుదారులు దేశం విడిచి వెళ్లాల్సి ఉంటుందనే అంశంపై మాత్రం స్పష్టమైన మార్గదర్శకాలు ఇవ్వకపోవడంతో వలసదారుల్లో ఇంకా అనేక ప్రశ్నలు మిగిలే ఉన్నాయి.
Andhra pradesh Andhrapradesh APNews BreakingNews Breaking news BusinessNews CricketNews CrimeNews EducationNews EntertainmentNews Geopolitics Government Hyderabad India IndianCinema IndiaNews InternationalNews LatestNews MarketUpdate MovieNews News NewsUpdate PoliticalNews shivasakthi shivasakthienterprises shivasakthimedia shivasakthi net shivasakthinet shivasakthi news shivasakthinews ShivaSakthiUpdates ShivaShaktiMedia ShivaShaktiNews SportsNews StockMarket TechNews Telangana TelanganaNews TeluguCinema TeluguNews Tollywood TrendingNews ViralNews Wellness WorldNews


















