వెలిగొండ ప్రాజెక్టులో భాగంగా నిర్మించిన నల్లమలసాగర్ జలాశయంలోకి ఈ నెలాఖరులో నీటిని విడుదల చేసేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది. జలాశయంలో నీరు చేరితే ప్రకాశం, నెల్లూరు, కడప జిల్లాల్లోని లక్షలాది మందికి తాగునీటితో పాటు సాగునీటి ప్రయోజనం కలగనుంది. అయితే ఈ భారీ ప్రయోజనం వెనుక వేలాది నిర్వాసిత కుటుంబాల త్యాగం ఉంది.
జలాశయం పరిధిలో 11 గ్రామాలు ముంపునకు గురికానున్నాయి. దీంతో మొత్తం 7,321 కుటుంబాలు తమ పుట్టిన ఊళ్లను ఖాళీ చేయాల్సి వస్తోంది. పునరావాస కాలనీల్లో ఇళ్ల స్థలాలు, మౌలిక వసతులు కల్పించే ప్రక్రియ కొనసాగుతుండగా.. పరిహారం పంపిణీ కూడా వేగవంతమైంది.
కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత తొలిసారిగా ఈ ఏడాది నిర్వాసితులకు పునరావాస ప్యాకేజీ సొమ్ములు అందుతున్నాయి. ఇప్పటికే 2,565 కుటుంబాలకు దాదాపు రూ.318 కోట్ల పరిహారాన్ని ప్రభుత్వం చెల్లించింది. మరో 2,865 కుటుంబాలకు సంబంధించిన బిల్లులు అప్‌లోడ్ కాగా.. మిగిలిన 1,891 కుటుంబాలకు సంబంధించిన బిల్లుల ప్రక్రియ కొనసాగుతోంది.
పునరావాస కాలనీలకు తరలేంతవరకు చాలామంది నిర్వాసితులు అద్దె ఇళ్ల కోసం వెతుకుతున్నారు. కొందరు బంధువుల ఇళ్లలో తాత్కాలికంగా ఆశ్రయం పొందుతున్నారు. ఏళ్ల తరబడి నివసించిన ఇళ్లు, గ్రామాలను విడిచి వెళ్లాల్సి రావడంతో పలువురు భావోద్వేగానికి గురవుతున్నారు.
మొత్తం 3,961 కుటుంబాల కోసం ప్రభుత్వం ఏడు పునరావాస కాలనీలను ఏర్పాటు చేసింది. ఎస్టీ కుటుంబాలకు రూ.13.01 లక్షలు, ఎస్సీ కుటుంబాలకు రూ.12.76 లక్షలు, బీసీ, ఓబీసీ కుటుంబాలకు రూ.11.76 లక్షల చొప్పున ప్యాకేజీ ఇవ్వనున్నారు. మరో 3,360 కుటుంబాలు వన్‌టైం సెటిల్‌మెంట్‌కు అంగీకరించాయి. వీరికి ఒక్కో కుటుంబానికి రూ.12.50 లక్షల చొప్పున పరిహారం అందుతోంది.
ఇళ్ల నిర్మాణానికి అయ్యే ఖర్చును కూడా ప్రభుత్వం ఇవ్వాలని కొన్ని కుటుంబాలు కోరుతున్నాయి. తమకు అందే పరిహారంతో సొంతంగా ఇళ్లు నిర్మించుకునేందుకు మరికొన్ని కుటుంబాలు సిద్ధమవుతున్నాయి. మరోవైపు దేవరాజుగట్టు కాలనీలో అదనంగా 15 ఎకరాల భూసేకరణ వేగంగా సాగుతోంది. ఇప్పటికే 54 ఎకరాల్లో లేఅవుట్ సిద్ధం చేసిన అధికారులు ఇంటి స్థలాల పట్టాల పంపిణీకి ఏర్పాట్లు చేస్తున్నారు.
వెలిగొండ ప్రాజెక్టు నిర్వాసితుల్లో మరో 1,600 కుటుంబాలకు రూ.200 కోట్ల పరిహారాన్ని బుధవారం పంపిణీ చేయనున్నట్లు మంత్రి రామానాయుడు తెలిపారు. వెలగపూడి సచివాలయంలో జరిగే కార్యక్రమంలో కొంతమంది రైతులకు ముఖ్యమంత్రి చంద్రబాబు చెక్కులు అందజేయనున్నట్లు చెప్పారు. మిగిలిన కుటుంబాలకు కూడా త్వరితగతిన పరిహారం అందించేలా అధికారులు చర్యలు తీసుకుంటున్నారువెలిగొండ ప్రాజెక్టులో భాగంగా నిర్మించిన నల్లమలసాగర్ జలాశయంలోకి ఈ నెలాఖరులో నీటిని విడుదల చేసేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది. జలాశయంలో నీరు చేరితే ప్రకాశం, నెల్లూరు, కడప జిల్లాల్లోని లక్షలాది మందికి తాగునీటితో పాటు సాగునీటి ప్రయోజనం కలగనుంది. అయితే ఈ భారీ ప్రయోజనం వెనుక వేలాది నిర్వాసిత కుటుంబాల త్యాగం ఉంది.
జలాశయం పరిధిలో 11 గ్రామాలు ముంపునకు గురికానున్నాయి. దీంతో మొత్తం 7,321 కుటుంబాలు తమ పుట్టిన ఊళ్లను ఖాళీ చేయాల్సి వస్తోంది. పునరావాస కాలనీల్లో ఇళ్ల స్థలాలు, మౌలిక వసతులు కల్పించే ప్రక్రియ కొనసాగుతుండగా.. పరిహారం పంపిణీ కూడా వేగవంతమైంది.
కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత తొలిసారిగా ఈ ఏడాది నిర్వాసితులకు పునరావాస ప్యాకేజీ సొమ్ములు అందుతున్నాయి. ఇప్పటికే 2,565 కుటుంబాలకు దాదాపు రూ.318 కోట్ల పరిహారాన్ని ప్రభుత్వం చెల్లించింది. మరో 2,865 కుటుంబాలకు సంబంధించిన బిల్లులు అప్‌లోడ్ కాగా.. మిగిలిన 1,891 కుటుంబాలకు సంబంధించిన బిల్లుల ప్రక్రియ కొనసాగుతోంది.
పునరావాస కాలనీలకు తరలేంతవరకు చాలామంది నిర్వాసితులు అద్దె ఇళ్ల కోసం వెతుకుతున్నారు. కొందరు బంధువుల ఇళ్లలో తాత్కాలికంగా ఆశ్రయం పొందుతున్నారు. ఏళ్ల తరబడి నివసించిన ఇళ్లు, గ్రామాలను విడిచి వెళ్లాల్సి రావడంతో పలువురు భావోద్వేగానికి గురవుతున్నారు.
మొత్తం 3,961 కుటుంబాల కోసం ప్రభుత్వం ఏడు పునరావాస కాలనీలను ఏర్పాటు చేసింది. ఎస్టీ కుటుంబాలకు రూ.13.01 లక్షలు, ఎస్సీ కుటుంబాలకు రూ.12.76 లక్షలు, బీసీ, ఓబీసీ కుటుంబాలకు రూ.11.76 లక్షల చొప్పున ప్యాకేజీ ఇవ్వనున్నారు. మరో 3,360 కుటుంబాలు వన్‌టైం సెటిల్‌మెంట్‌కు అంగీకరించాయి. వీరికి ఒక్కో కుటుంబానికి రూ.12.50 లక్షల చొప్పున పరిహారం అందుతోంది.
ఇళ్ల నిర్మాణానికి అయ్యే ఖర్చును కూడా ప్రభుత్వం ఇవ్వాలని కొన్ని కుటుంబాలు కోరుతున్నాయి. తమకు అందే పరిహారంతో సొంతంగా ఇళ్లు నిర్మించుకునేందుకు మరికొన్ని కుటుంబాలు సిద్ధమవుతున్నాయి. మరోవైపు దేవరాజుగట్టు కాలనీలో అదనంగా 15 ఎకరాల భూసేకరణ వేగంగా సాగుతోంది. ఇప్పటికే 54 ఎకరాల్లో లేఅవుట్ సిద్ధం చేసిన అధికారులు ఇంటి స్థలాల పట్టాల పంపిణీకి ఏర్పాట్లు చేస్తున్.
వెలిగొండ ప్రాజెక్టు నిర్వాసితుల్లో మరో 1,600 కుటుంబాలకు రూ.200 కోట్ల పరిహారాన్ని బుధవారం పంపిణీ చేయనున్నట్లు మంత్రి రామానాయుడు తెలిపారు. వెలగపూడి సచివాలయంలో జరిగే కార్యక్రమంలో కొంతమంది రైతులకు ముఖ్యమంత్రి చంద్రబాబు చెక్కులు అందజేయనున్నట్లు చెప్పారు. మిగిలిన కుటుంబాలకు కూడా త్వరితగతిన పరిహారం అందించేలా అధికారులు చర్యలు తీసుకుంటున్నారు
Andhra pradesh Andhrapradesh APNews BreakingNews Breaking news BusinessNews CricketNews CrimeNews EducationNews EntertainmentNews Geopolitics Government Hyderabad India IndianCinema IndiaNews InternationalNews LatestNews MarketUpdate MovieNews News NewsToday NewsUpdate PoliticalNews shivasakthi shivasakthienterprises shivasakthimedia shivasakthi net shivasakthinet shivasakthi news shivasakthinews ShivaSakthiUpdates ShivaShaktiMedia ShivaShaktiNews SportsNews StockMarket TechNews Telangana TelanganaNews TeluguCinema TeluguNews Tollywood TrendingNews ViralNews WorldNews