తమిళనాడు రాజకీయాల్లో కీలక పరిణామంగా భావిస్తున్న అసెంబ్లీ బలపరీక్షలో అధికార పార్టీ టీవీకే ఘన విజయం సాధించింది. మ్యాజిక్ ఫిగర్ 118 కాగా, టీవీకేకు అనుకూలంగా 144 ఓట్లు రావడంతో ప్రభుత్వం విశ్వాస పరీక్షను సులభంగా గెలిచింది. వ్యతిరేకంగా అన్నాడీఎంకే ఈపీఎస్ వర్గానికి చెందిన 22 మంది ఎమ్మెల్యేలు ఓటు వేయగా, ఐదుగురు తటస్థంగా నిలిచారు.
బలపరీక్ష అనంతరం సీఎం విజయ్ మాట్లాడుతూ తమ ప్రభుత్వం లౌకికవాద విధానాలతో ముందుకు సాగుతుందని స్పష్టం చేశారు. డీఎంకే ప్రభుత్వం ప్రవేశపెట్టిన ప్రజా సంక్షేమ పథకాలను కొనసాగిస్తామని తెలిపారు. ఎమ్మెల్యేల మద్దతు కోసం ఎలాంటి బేరసారాలు జరగలేదని పేర్కొన్నారు.
ఇక ప్రతిపక్ష నేత ఉదయనిధి స్టాలిన్ మాత్రం విజయ్ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు. సోషల్ మీడియా రీల్స్ తరహాలో కాకుండా వాస్తవిక పాలన అందించాలని సూచించారు. టీవీకేకు పూర్తి స్థాయి బలం లేదని, మిత్రపక్షాల మద్దతుతోనే ప్రభుత్వం ఏర్పడిందన్నారు.
అన్నాడీఎంకేలో కూడా విభేదాలు స్పష్టంగా బయటపడ్డాయి. షణ్ముగం వర్గం ఎమ్మెల్యేలు టీవీకేకు మద్దతు తెలపగా, ఈపీఎస్ వర్గం తీవ్రంగా వ్యతిరేకించింది. దీంతో అసెంబ్లీలో పరస్పర ఆరోపణలు చోటుచేసుకున్నాయి.ఇదిలా ఉండగా సీఎం విజయ్‌కు ఓఎస్డీగా జ్యోతిష్కుడు రిక్కీ రాధన్ పండిట్ వట్రివేల్‌ను నియమించడంపై తీవ్ర విమర్శలు రావడంతో ప్రభుత్వం 24 గంటల్లోనే ఆ నియామకాన్ని రద్దు చేసింది.
Andhra pradesh Andhrapradesh APNews BreakingNews Breaking news BusinessNews CricketNews CrimeNews EducationNews EntertainmentNews Geopolitics Government India IndianCinema IndiaNews InternationalNews LatestNews MarketUpdate MovieNews News NewsToday NewsUpdate PoliticalNews PublicSafety shivasakthi shivasakthienterprises shivasakthimedia shivasakthi net shivasakthinet shivasakthi news shivasakthinews ShivaSakthiUpdates ShivaShaktiMedia ShivaShaktiNews SportsNews StockMarket TechNews Telangana TelanganaNews TeluguCinema TeluguNews Tollywood TrendingNews ViralNews WorldNews

















