హైదరాబాద్‌లో ఉబర్ సెంటర్ ఆఫ్ ఎక్స్‌లెన్స్‌ను మరింత విస్తరిస్తున్నట్లు ఆ సంస్థ సీఈఓ దారా ఖోస్రోషాహి ప్రకటించారు. అమెరికా వెలుపల ఏర్పాటు చేసిన తొలి సెంటర్ ఇదేనని, ప్రస్తుతం ఇక్కడ 600 మంది ఇంజినీర్లు పని చేస్తున్నారని తెలిపారు. తెలంగాణ ప్రభుత్వం అభివృద్ధి చేస్తున్న ఫ్యూచర్ సిటీలో ఉబర్ కార్పొరేట్ ఆఫీస్ నిర్మాణానికి సంస్థ ముందుకు రావడం ప్రాధాన్యత సంతరించుకుంది.
రాష్ట్రంలో తమ కార్యకలాపాలను భవిష్యత్తులో మరింత విస్తరించాలని భావిస్తున్నామని, అందుకు ప్రభుత్వ సహకారం అవసరమని దారా ఖోస్రోషాహి ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డిని కోరారు. బుధవారం ఉబర్ ప్రతినిధుల బృందం సీఎంతో సమావేశమై పలు అంశాలపై చర్చించింది.
ఈ సందర్భంగా ప్రధాన నగరాల్లో పెరుగుతున్న పార్కింగ్ సమస్యపై దృష్టి పెట్టాలని సీఎం సూచించారు. మెట్రో స్టేషన్ల వద్ద మల్టీలెవల్ పార్కింగ్ సెంటర్లు, ఈవీ ఛార్జింగ్ సదుపాయాలు ఏర్పాటు చేస్తే ప్రయాణికులకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని పేర్కొన్నారు. సీఎం సూచనలను అధ్యయనం చేసి చర్యలు తీసుకుంటామని ఉబర్ బృందం తెలిపింది.ఇక 30 వేల ఎకరాల్లో నిర్మిస్తున్న ఫ్యూచర్ సిటీలో ప్రపంచ స్థాయి 500 కంపెనీలను ఆహ్వానిస్తున్నామని సీఎం రేవంత్‌రెడ్డి తెలిపారు. ఇప్పటికే అనేక సంస్థలు పెట్టుబడులకు ముందుకు వచ్చాయని వెల్లడించారు.
Andhra pradesh Andhrapradesh APNews BreakingNews Breaking news BusinessNews CricketNews CrimeNews EducationNews EntertainmentNews Geopolitics Government Hyderabad India IndianCinema IndiaNews InternationalNews LatestNews MarketUpdate MovieNews News NewsToday NewsUpdate PoliticalNews shivasakthi shivasakthienterprises shivasakthimedia shivasakthi net shivasakthinet shivasakthi news shivasakthinews ShivaSakthiUpdates ShivaShaktiMedia ShivaShaktiNews SportsNews StockMarket TechNews Telangana TelanganaNews TeluguCinema TeluguNews Tollywood TrendingNews ViralNews WorldNews



















