పోలవరం జిల్లా చింతూరు మండలంలో విజయవాడ-జగదల్‌పూర్ జాతీయ రహదారిపై శుక్రవారం రాత్రి ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. బొడ్డుగూడెం, ఏడుగురాళ్లపల్లి గ్రామాల మధ్య మూలమలుపు వద్ద ఇనుప లోడుతో వెళ్తున్న లారీని కారు ఢీకొనడంతో ఇద్దరు ప్రాణాలు కోల్పోయారు.
ఒడిశా నుంచి చెన్నై వైపు ఇనుప లోడుతో వెళ్తున్న లారీని.. భద్రాచలం నుంచి చింతూరు వైపు వస్తున్న కారు బలంగా ఢీకొట్టింది. ఢీకొన్న తీవ్రతకు లారీ కారును సుమారు వంద మీటర్ల మేర ఈడ్చుకెళ్లింది. అనంతరం కారులో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి.
కారు నడుపుతున్న నిమ్మకాయల అయ్యన్న (35) ప్రమాదం ధాటికి బయటకు పడిపోయి గాయపడ్డారు. మరో వ్యక్తి అవిడి సూర్యవినయతేజ (28) కారులోనే చిక్కుకుపోయారు. రహదారిపై వెళ్తున్న కొందరు అతడిని బయటకు తీసేందుకు ప్రయత్నించిన సమయంలోనే మంటలు వేగంగా వ్యాపించడంతో రక్షణ చర్యలు విఫలమయ్యాయి. దీంతో సూర్యవినయతేజ కారులోనే సజీవ దహనమయ్యారు.
తీవ్ర గాయాలపాలైన అయ్యన్నను ఏడుగురాళ్లపల్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తరలించారు. అయితే అప్పటికే ఆయన మృతిచెందినట్లు వైద్యులు నిర్ధరించారు. సమాచారం అందుకున్న చింతూరు సీఐ గోపాలకృష్ణ, ఎస్సై సంతోష్‌కుమార్ సంఘటనా స్థలానికి చేరుకుని ప్రమాద పరిస్థితులను పరిశీలించారు. కూనవరం అగ్నిమాపక కేంద్రం సిబ్బంది అక్కడికి చేరుకుని మంటలను అదుపులోకి తీసుకొచ్చారు.
ప్రమాదానికి గురైన కారు రిజిస్ట్రేషన్ నంబరు TS08GE9755గా గుర్తించారు. వాహనం రిజిస్ట్రేషన్ వివరాల ఆధారంగా పోలీసులు దర్యాప్తు చేపట్టారు. రిజిస్ట్రేషన్‌లో ఉన్న వ్యక్తి సెల్‌ఫోన్‌కు పోలీసులు ఫోన్ చేయగా.. కారును గతంలోనే విక్రయించినట్లు వారు తెలిపారు. దీంతో కారు ప్రస్తుత యజమాని, ప్రమాదానికి దారితీసిన పరిస్థితులపై పోలీసులు విచారణ కొనసాగిస్తున్నారు.
మృతులను రంగారెడ్డి జిల్లా మియాపూర్‌కు చెందిన అవిడి సూర్యవినయతేజ (28), తూర్పుగోదావరి జిల్లా రాయవరం మండలం సోమేశ్వరం గ్రామానికి చెందిన నిమ్మకాయల అయ్యన్న (35)గా పోలీసులు గుర్తించారు. ప్రమాదంపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Andhra pradesh Andhrapradesh APNews BreakingNews Breaking news BusinessNews CricketNews CrimeNews EducationNews EntertainmentNews Geopolitics Government Hyderabad India IndianCinema IndiaNews InternationalNews LatestNews MarketUpdate MovieNews News NewsToday NewsUpdate PoliticalNews shivasakthi shivasakthienterprises shivasakthimedia shivasakthi net shivasakthinet shivasakthi news shivasakthinews ShivaSakthiUpdates ShivaShaktiMedia ShivaShaktiNews SportsNews StockMarket TechNews Telangana TelanganaNews TeluguCinema TeluguNews Tollywood TrendingNews ViralNews WorldNews



















