ములుగు జిల్లా మంగపేట మండలం శాంతినగర్ గ్రామంలో తాగునీటి సమస్య తీవ్రంగా మారింది. గత మూడు నెలలుగా నీటి కోసం గ్రామస్తులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.గ్రామంలో తాగునీటి కొరతను అధిగమించేందుకు గ్రామస్తులు ఎంతో కష్టపడి బావి తవ్వుకున్నారు. అయితే ఆ బావిలో కూడా నీరు రాకపోవడంతో వారి ఆశలు నెరవేరలేదు. ఈ సమస్యను పంచాయతీ అధికారుల దృష్టికి తీసుకెళ్లినప్పటికీ, కేవలం ఒక్కరోజు మాత్రమే ట్యాంకర్ ద్వారా నీరు సరఫరా చేసినట్లు గ్రామస్తులు తెలిపారు. మిగతా రోజుల్లో వారు మండల కేంద్రానికి వెళ్లి స్వయంగా నీటిని తెచ్చుకుంటూ కష్టాలు పడుతున్నారు.
ముఖ్యంగా మహిళలు, వృద్ధులు ఎక్కువగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వెంటనే శాశ్వత పరిష్కారం చూపించాలని వారు ప్రభుత్వాన్ని, అధికారులను కోరుతున్నారు
Andhra pradesh Andhrapradesh AndhraPradeshNews APNews APPolitics Breaking news BreakingNews Business BusinessNews ChandrababuNaidu CricketNews CrimeNews Geopolitics governance Government India IndiaNews LawAndOrder Movies Naralokesh News news24 newsalert NewsToday NewsUpdate PoliticalNews PublicSafety shivasakthi ShivasakthiDigital shivasakthienterprises shivasakthimedia shivasakthi net shivasakthinet shivasakthi news shivasakthinews ShivaSakthiUpdates ShivaShaktiMedia ShivaShaktiNews ShivaShaktiUpdates Telangana TelanganaNews TeluguNews TrendingNow ViralNews WorldNews



















