ఇరాన్-ఇజ్రాయెల్ మధ్య మళ్లీ చెలరేగిన ఉద్రిక్తతలు ప్రపంచ మార్కెట్లను కుదిపేస్తున్నాయి. యుద్ధ భయాల ప్రభావంతో సోమవారం దేశీయ స్టాక్ మార్కెట్లు భారీ నష్టాలతో ప్రారంభమయ్యాయి. ఉదయం ట్రేడింగ్‌లో సెన్సెక్స్ 800 పాయింట్లకు పైగా పతనమవగా, నిఫ్టీ కూడా 200 పాయింట్లకుపైగా నష్టాల్లో కొనసాగింది.
ఉదయం 9:33 గంటల సమయంలో సెన్సెక్స్ 675 పాయింట్లు కోల్పోయి 73,567 వద్ద ట్రేడవుతుండగా, నిఫ్టీ 215 పాయింట్లు పడిపోయి 23,150 స్థాయిలో కదలాడింది. గ్లోబల్ మార్కెట్లలో నెలకొన్న అనిశ్చితి, ముడి చమురు ధరల పెరుగుదల, పెట్టుబడిదారుల ఆందోళనలు మార్కెట్లపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయి.
లెబనాన్‌పై ఇజ్రాయెల్ దాడులకు ప్రతీకారంగా ఇరాన్ ప్రతిదాడులు ప్రారంభించడంతో మధ్యప్రాచ్యంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఈ పరిణామాల నేపథ్యంలో అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధరలు ఒక్కసారిగా 3 శాతం పెరిగి బ్యారెల్‌కు 96 డాలర్లకు పైగా చేరాయి.
చమురు ధరల పెరుగుదలతో ద్రవ్యోల్బణం, దిగుమతి వ్యయాలు పెరిగే అవకాశముండటంతో ఇన్వెస్టర్లు అప్రమత్తమయ్యారు. దీంతో ఐటీ, మెటల్, ఆటో రంగ షేర్లలో అమ్మకాల ఒత్తిడి కనిపించింది. విప్రో, టీసీఎస్, మహీంద్రా అండ్ మహీంద్రా, హిందాల్కో, ఇంటర్‌గ్లోబ్ ఏవియేషన్ షేర్లు నష్టాల్లో ట్రేడవుతుండగా, సన్ ఫార్మా, డాక్టర్ రెడ్డీస్, అపోలో హాస్పిటల్స్, యాక్సిస్ బ్యాంక్, నెస్లే షేర్లు స్వల్ప లాభాల్లో కొనసాగాయి.
మధ్యప్రాచ్య పరిస్థితులు మరింత ఉద్రిక్తంగా మారితే మార్కెట్లపై ఒత్తిడి కొనసాగవచ్చని మార్కెట్ నిపుణులు అంచనా వేస్తున్నారు.
Andhra pradesh Andhrapradesh APNews BreakingNews Breaking news BusinessNews CricketNews CrimeNews EducationNews EntertainmentNews Geopolitics Government Hyderabad India IndianCinema IndiaNews InternationalNews LatestNews MarketUpdate MovieNews News NewsUpdate PoliticalNews shivasakthi shivasakthienterprises shivasakthimedia shivasakthi net shivasakthinet shivasakthi news shivasakthinews ShivaSakthiUpdates ShivaShaktiMedia ShivaShaktiNews SportsNews StockMarket TechNews Telangana TelanganaNews TeluguCinema TeluguNews Tollywood TrendingNews ViralNews Wellness WorldNews



















