దేశీయ స్టాక్ మార్కెట్లు సోమవారం భారీ నష్టాలతో ప్రారంభమయ్యాయి. పశ్చిమాసియాలో యుద్ధం ముగింపుపై నెలకొన్న అనిశ్చితి, చమురు ధరల పెరుగుదల, ఇరాన్‌కు మద్దతుగా హూతీ గ్రూప్ రంగప్రవేశం పెట్టుబడిదారుల్లో ఆందోళన కలిగిస్తున్నాయి. దీంతో సూచీలు ఒత్తిడిలో కదులుతున్నాయి. ప్రారంభంలో సెన్సెక్స్ వెయ్యి పాయింట్లకు పైగా పతనమైంది.
ఉదయం 9:29 గంటల సమయానికి సెన్సెక్స్ 858 పాయింట్లు పడిపోయి 72,724 వద్ద ట్రేడవుతుండగా, నిఫ్టీ 244 పాయింట్లు తగ్గి 22,575 వద్ద ఉంది. డాలర్‌తో పోలిస్తే రూపాయి మారకం విలువ 93.57గా నమోదై, గత సెషన్‌తో పోలిస్తే స్వల్పంగా పుంజుకుంది.
నిఫ్టీ సూచీలో హిందాల్కో, కోల్ ఇండియా, ఓఎన్‌జీసీ, భారత్ ఎలక్ట్రానిక్స్, రిలయన్స్ షేర్లు లాభాల్లో ఉండగా.. యాక్సిస్ బ్యాంక్, కొటక్ మహీంద్రా, మ్యాక్స్ హెల్త్‌కేర్, హెచ్‌డీఎఫ్‌సీ, బజాజ్ ఫిన్‌సర్వ్ షేర్లు నష్టాల్లో కొనసాగుతున్నాయి.
ఇదిలా ఉంటే, హూతీ గ్రూప్ మద్దతుతో ఎర్ర సముద్ర ప్రాంతంలో ఉద్రిక్తతలు పెరగొచ్చనే భయంతో చమురు ధరలు మళ్లీ ఎగసిపడుతున్నాయి. అంతర్జాతీయంగా బ్రెంట్ క్రూడ్ ధర మూడు శాతం పెరిగి బ్యారెల్‌కు 115.9 డాలర్లకు చేరింది. గ్లోబల్ మార్కెట్లలో బలహీనత కూడా దేశీయ సూచీలపై ప్రభావం చూపుతోంది.
అయితే రూపాయి పతనాన్ని నియంత్రించేందుకు ఆర్బీఐ చర్యలు తీసుకుంది. ఆన్‌షోర్ మార్కెట్లో బ్యాంకుల ఓపెన్ పొజిషన్లను రోజువారీగా 100 మిలియన్ డాలర్లకు పరిమితం చేసే నిబంధనలు అమలు చేయనుంది. ఈ మార్పులు ఏప్రిల్ 10 నుంచి అమల్లోకి రానున్నాయి.
Andhra pradesh Andhrapradesh APNews BreakingNews Breaking news BusinessNews CricketNews CrimeNews EducationNews EntertainmentNews Geopolitics Government Hyderabad India IndianCinema IndiaNews InternationalNews LatestNews MarketUpdate MovieNews News NewsToday NewsUpdate PoliticalNews shivasakthi shivasakthienterprises shivasakthimedia shivasakthi net shivasakthinet shivasakthi news shivasakthinews ShivaSakthiUpdates ShivaShaktiMedia ShivaShaktiNews SportsNews StockMarket TechNews Telangana TelanganaNews TeluguCinema TeluguNews Tollywood TrendingNews ViralNews WorldNews



















