ఇజ్రాయెల్ తన రక్షణ సామర్థ్యాలను మరింత బలోపేతం చేసుకునే దిశగా కీలక నిర్ణయాలు తీసుకుంది. అమెరికా నుంచి అదనంగా ఎఫ్-35ఐ, ఎఫ్-15ఐఏ యుద్ధ విమానాలను కొనుగోలు చేయనున్నట్లు ఆ దేశ రక్షణశాఖ ప్రకటించింది. ఈ కొనుగోళ్లకు సీనియర్ మంత్రులతో కూడిన కమిటీ ఆమోదం తెలిపినట్లు వెల్లడించింది.
ఈ ఒప్పందం ద్వారా ఇజ్రాయెల్ గగనతల ఆధిపత్యం మరింత బలపడుతుందని ప్రధాని నెతన్యాహు తెలిపారు. తమ పైలట్లు ఇరాన్ గగనతలంలో ఎక్కడికైనా చొచ్చుకెళ్లగల సామర్థ్యం కలిగి ఉన్నారని, అందుకు పూర్తి స్థాయిలో సిద్ధంగా ఉన్నారని పేర్కొన్నారు.
ఇక దేశీయ రక్షణ తయారీ రంగాన్ని విస్తరించడంపై కూడా ప్రభుత్వం దృష్టి పెట్టింది. రాబోయే దశాబ్దంలో రక్షణ బడ్జెట్‌కు అదనంగా 350 బిలియన్ షెకెల్స్ కేటాయించాలని యోచిస్తున్నట్లు నెతన్యాహు వెల్లడించారు.
కొత్తగా కొనుగోలు చేసే యుద్ధ విమానాలు ప్రాంతీయ ముప్పులను సమర్థంగా ఎదుర్కొనేందుకు, ఇజ్రాయెల్ గగనతల భద్రతను కాపాడేందుకు కీలక పాత్ర పోషిస్తాయని రక్షణశాఖ తెలిపింది. ప్రస్తుతం ఇజ్రాయెల్ వద్ద 48 ఎఫ్-35 యుద్ధవిమానాలు ఉండగా, మరిన్ని విమానాల కొనుగోలుతో సైనిక శక్తి మరింత పెరగనుంది.ఈ చర్యలు పశ్చిమాసియాలో కొనసాగుతున్న ఉద్రిక్తతల మధ్య ఇజ్రాయెల్ రక్షణ వ్యూహాన్ని మరింత దృఢపరచేలా కనిపిస్తున్నాయి.
Andhra pradesh Andhrapradesh APNews BreakingNews Breaking news BusinessNews CricketNews CrimeNews EducationNews EntertainmentNews Geopolitics Government India IndianCinema IndiaNews InternationalNews LatestNews MarketUpdate MovieNews News NewsToday NewsUpdate PoliticalNews PublicSafety shivasakthi shivasakthienterprises shivasakthimedia shivasakthi net shivasakthinet shivasakthi news shivasakthinews ShivaSakthiUpdates ShivaShaktiMedia ShivaShaktiNews SportsNews StockMarket TechNews Telangana TelanganaNews TeluguCinema TeluguNews Tollywood TrendingNews ViralNews WorldNews



















