రేషన్ కార్డుదారులకు కేజీ గోధుమ పిండిని కేవలం రూ.20కే అందిస్తున్నామని, ఇది పాలిష్ చేసిన సన్నబియ్యంతో పోలిస్తే ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుందని రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు. కిలో రేషన్ బియ్యంపై ప్రభుత్వం రూ.47.10 వరకు ఖర్చు చేస్తోందని ఆయన వెల్లడించారు.
గుంటూరు జిల్లా తెనాలిలో ఆదివారం రేషన్ కార్డుదారులకు రూ.20కే గోధుమ పిండి పంపిణీ కార్యక్రమాన్ని మంత్రి నాదెండ్ల మనోహర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా జిల్లా కేంద్రాల్లో రోజుకు సుమారు 1,800 టన్నుల గోధుమ పిండిని పంపిణీ చేస్తున్నామని చెప్పారు. రానున్న రోజుల్లో ఈ కార్యక్రమాన్ని అన్ని ప్రాంతాలకు విస్తరిస్తామని స్పష్టం చేశారు.
వైకాపా పాలనలో రేషన్ పంపిణీ విధానం కొద్దిమందికే ఉపయోగపడేలా మారిందని మంత్రి విమర్శించారు. రేషన్ కార్డులపై కూడా రాజకీయ ప్రచారానికి సంబంధించిన ఫొటోలు, రంగులు నింపారని ఆరోపించారు. అయితే కూటమి ప్రభుత్వంలో చౌకధరల దుకాణాల పనివేళల్లో మార్పులు చేసి, నెలలో 15 రోజుల పాటు ఉదయం నుంచి సాయంత్రం వరకూ అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకున్నామని తెలిపారు.
స్మార్ట్ రేషన్‌కార్డు అమలుతో రాష్ట్రంలోని ఏ చౌకధరల దుకాణంలోనైనా రేషన్ సరుకులు పొందే వెసులుబాటు కల్పించామని మంత్రి పేర్కొన్నారు. అదేవిధంగా డీలర్లకు కూడా ఆదాయం పెరిగేలా కొత్త విధానాలు తీసుకొస్తామని తెలిపారు. రానున్న రోజుల్లో కొండప్రాంతాలు, ఇతర ప్రాంతాల్లో పండే సేంద్రియ సాగు ఉత్పత్తులను కూడా డీలర్ల ద్వారానే ప్రజలకు చేరువ చేసేలా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నామని ఆయన వెల్లడించారు.ఈ చర్యలన్నీ ప్రజలకు నాణ్యమైన ఆహారం అందించడంతో పాటు, రేషన్ వ్యవస్థను మరింత పారదర్శకంగా, ప్రజానుకూలంగా మార్చడమే లక్ష్యంగా చేపట్టినవని మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు.
Andhra pradesh Andhrapradesh APNews BreakingNews Breaking news BusinessNews CricketNews CrimeNews EducationNews EntertainmentNews Geopolitics Government India IndianCinema IndiaNews InternationalNews LatestNews MarketUpdate MovieNews News NewsToday NewsUpdate PoliticalNews PublicSafety shivasakthi shivasakthienterprises shivasakthimedia shivasakthi net shivasakthinet shivasakthi news shivasakthinews ShivaSakthiUpdates ShivaShaktiMedia ShivaShaktiNews SportsNews StockMarket TechNews Telangana TelanganaNews TeluguCinema TeluguNews Tollywood TrendingNews ViralNews WorldNews



















