మానసిక సమస్యతో బాధపడుతున్న ఓ మహిళ 40 రోజుల వయసున్న పసికందును నదిలో పడేసిన ఘటన చోడవరం లో ఆదివారం చోటుచేసుకుంది. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, మునగపాక మండలం నరేంద్రపురం గ్రామానికి చెందిన లీలకు, మాడుగుల మండలం పి. అగ్రహారం గ్రామానికి చెందిన బంటు శివకు గతేడాది మార్చిలో వివాహమైంది. వీరికి డిసెంబర్ 28న మగబిడ్డ జన్మించాడు. ప్రసవం అనంతరం లీల మానసికంగా అనారోగ్యానికి గురైనట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. ప్రస్తుతం వారు చోడవరం కోటవీధిలోని ఓ అద్దె ఇంట్లో నివాసం ఉంటున్నారు.
శనివారం భర్త శివ స్వగ్రామానికి వెళ్లగా, అదే రాత్రి సుమారు 12 గంటల సమయంలో లీల పసికందును తీసుకొని ఇంటి నుంచి బయటకు వెళ్లింది. విషయం తెలిసిన శివ వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చాడు. ఆదివారం ఉదయం లీల భర్తకు ఫోన్ చేసి గోవాడ చక్కెర కర్మాగారం వద్ద ఉన్నట్లు తెలిపింది. అక్కడికి చేరుకున్న శివ బిడ్డ గురించి అడగగా, శారదా నదిలో చేయి నుంచి జారిపడి కొట్టుకుపోయాడని చెప్పినట్లు పోలీసులు తెలిపారు.
సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని గాలింపు చర్యలు ప్రారంభించారు. NDRF బృందాలు, గజ ఈతగాళ్ల సహాయంతో శారదా నదిలో విస్తృతంగా గాలించారు. అయితే సాయంత్రం వరకు శిశువు ఆచూకీ లభ్యం కాలేదు.పోలీసుల విచారణలో, గతంలోనూ లీల ఒకసారి బిడ్డను ఇంట్లో వదిలి వెళ్లిపోయిన ఘటన జరిగినట్లు భర్త శివ వెల్లడించాడు. ఆ ఘటన అనంతరం కుటుంబ సభ్యులు జాగ్రత్తగా ఉండేందుకు చోడవరం వచ్చి బంధువులతో కలిసి నివసిస్తున్నట్లు తెలిపాడు. ఈ ఘటనపై పోలీసులు అన్ని కోణాల్లో దర్యాప్తు కొనసాగిస్తున్నారు.
Andhra pradesh Andhrapradesh APNews BreakingNews Breaking news BusinessNews CricketNews CrimeNews EducationNews EntertainmentNews Geopolitics Government Hyderabad India IndianCinema IndiaNews InternationalNews LatestNews MarketUpdate MovieNews News NewsUpdate PoliticalNews shivasakthi shivasakthienterprises shivasakthimedia shivasakthi net shivasakthinet shivasakthi news shivasakthinews ShivaSakthiUpdates ShivaShaktiMedia ShivaShaktiNews SportsNews StockMarket TechNews Telangana TelanganaNews TeluguCinema TeluguNews Tollywood TrendingNews ViralNews Wellness WorldNews



















