గుజరాత్‌లోని వడోదరలో ఓ మహిళ తన ప్రియుడితో కలిసి భర్తను హత్య చేయడానికి పన్నిన కుట్ర చివరకు బట్టబయలైంది. గిరీశ్ పటేల్ అనే వ్యక్తిని కత్తితో బెదిరించి కారులో ఎత్తుకెళ్లి, సొజిత్రా సమీపంలోని కాలువలో పడేశారు.
నిందితులు అతను చనిపోయాడని భావించి అక్కడి నుంచి పారిపోయారు. అయితే అదృష్టవశాత్తూ కాలువలో ఓ రాయి పట్టుకుని గిరీశ్ మూడు గంటల పాటు ప్రాణాలతో నిలబడ్డాడు. తర్వాత బయటపడి పోలీసులకు ఫిర్యాదు చేశాడు.
దర్యాప్తులో గిరీశ్ భార్య ఫాల్గుణి, ఆమె ప్రియుడు కౌషిక్ శర్మ కలిసి ఈ కుట్ర పన్నినట్టు తేలింది. గిరీశ్ అడ్డుగా ఉన్నాడని భావించి అతన్ని హత్య చేయాలని నిర్ణయించుకున్నారు.
కౌషిక్ రూ.35 వేలకే కిరాయి హంతకులను ఏర్పాటు చేయగా, ఫాల్గుణి అతనితో తరచూ ఫోన్‌లో మాట్లాడిన వివరాలు బయటపడ్డాయి. బాధితుడిని కిడ్నాప్ చేసిన సమయంలో అతని వద్ద ఉన్న డబ్బు, ATM కార్డులు కూడా దోచుకున్నారు. ఈ కేసులో మొత్తం ఆరుగురిని పోలీసులు అరెస్ట్ చేసి జ్యుడీషియల్ కస్టడీకి తరలించారు. ప్రస్తుతం మరింత దర్యాప్తు కొనసాగుతోంది.
Andhra pradesh Andhrapradesh APNews BreakingNews Breaking news BusinessNews CricketNews CrimeNews EducationNews EntertainmentNews Geopolitics Government Hyderabad India IndianCinema IndiaNews InternationalNews LatestNews MarketUpdate MovieNews News NewsToday NewsUpdate PoliticalNews shivasakthi shivasakthienterprises shivasakthimedia shivasakthi net shivasakthinet shivasakthi news shivasakthinews ShivaSakthiUpdates ShivaShaktiMedia ShivaShaktiNews SportsNews StockMarket TechNews Telangana TelanganaNews TeluguCinema TeluguNews Tollywood TrendingNews ViralNews WorldNews



















