మహిళల టీ20 ప్రపంచకప్ ఇంగ్లాండ్ వేదికగా జూన్ 12న ఆరంభం కానుంది. ఈ మెగా టోర్నీలో బరిలోకి దిగే భారత జట్టును శనివారం సెలక్టర్లు ప్రకటించారు. అమితా శర్మ నేతృత్వంలోని సెలక్షన్ కమిటీ.. బీసీసీఐ కార్యదర్శి దేవ్‌జిత్ సైకియా, ప్రధాన కోచ్ అమోల్ మజుందార్, కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్‌లతో సమావేశమైంది. అనంతరం టీ20 ప్రపంచ కప్ జట్టును ప్రకటించారు.
టీ20 ప్రపంచ కప్.. భారత జట్టు ఇదే
హర్మన్‌ప్రీత్ కౌర్(కెప్టెన్), స్మృతి మంధాన (వైస్ కెప్టెన్), షెఫాలీ వర్మ, జెమీమా రోడ్రిగ్స్, భారతి పుల్మాలి, దీప్తి శర్మ, రిచా ఘోష్, శ్రీచరణి, యాస్తికా భాటియా, నందిని శర్మ, అరుంధతి రెడ్డి, రేణుకాసింగ్ ఠాకూర్, క్రాంతి గౌడ్, శ్రేయాంక పాటిల్, రాధా యాదవ్.
భారత్, పాక్ మ్యాచ్ ఎప్పుడంటే?
మొత్తం 12 జట్లు పాల్గొంటున్నాయి. గ్రూప్-ఎలో ఉన్న భారత్ లీగ్ దశలో తొలి మ్యాచ్ పాకిస్థాన్‌తో (జూన్ 14న) ఆడనుంది. 17న నెదర్లాండ్స్, 21న సౌతాఫ్రికా, 25న బంగ్లాదేశ్, 28న ఆస్ట్రేలియాతో టీమ్ఇండియా తలపడనుంది. గ్రూప్-బిలో న్యూజిలాండ్, ఇంగ్లాండ్, వెస్టిండీస్, శ్రీలంక, స్కాట్లాండ్, ఐర్లాండ్ ఉన్నాయి. జూన్ 30న తొలి సెమీస్, జులై 2న రెండో సెమీస్ కెన్నింగ్టన్ ఓవల్, లండన్‌లో జరుగుతాయి. జులై 5న జరిగే ఫైనల్‌కు లార్డ్స్ మైదానం ఆతిథ్యమివ్వనుంది.
ప్రైజ్‌మనీ ఎంతంటే?
ఈసారి కప్‌నకు రూ.82 కోట్ల ప్రైజ్‌మనీని ఐసీసీ కేటాయించింది. గత టోర్నీతో పోలిస్తే ఇది పది శాతం ఎక్కువ. విజేతగా గెలిచే జట్టుకు రూ.21.8 కోట్లు నగదు బహుమతి అందనుంది. రన్నరప్‌కు రూ.10 కోట్లు లభిస్తాయి. సెమీస్‌లో ఓడిన జట్లు రూ.6.29 కోట్ల చొప్పున పొందుతాయి. ఒక్కో గ్రూప్ మ్యాచ్ విజయానికి రూ.29 లక్షల చొప్పున దక్కుతాయి. ఈ టోర్నీలో ఆడే 12 జట్లు కనీసం రూ.2.06 కోట్లు ఖాతాలో వేసుకోనున్నాయి.
Andhra pradesh Andhrapradesh APNews BreakingNews Breaking news BusinessNews CricketNews CrimeNews EducationNews EntertainmentNews Geopolitics Government Hyderabad India IndianCinema IndiaNews InternationalNews LatestNews MarketUpdate MovieNews News NewsUpdate PoliticalNews shivasakthi shivasakthienterprises shivasakthimedia shivasakthi net shivasakthinet shivasakthi news shivasakthinews ShivaSakthiUpdates ShivaShaktiMedia ShivaShaktiNews SportsNews StockMarket TechNews Telangana TelanganaNews TeluguCinema TeluguNews Tollywood TrendingNews ViralNews Wellness WorldNews


















