వీడియో స్ట్రీమింగ్ దిగ్గజం YouTube వినియోగదారుల అనుభవాన్ని మరింత మెరుగుపరచేందుకు ‘Ask YouTube’ అనే కొత్త ఏఐ ఫీచర్‌ను ప్రవేశపెడుతోంది. ఈ ఫీచర్ ద్వారా యూజర్లు సాధారణ సెర్చ్ కంటే మరింత స్మార్ట్‌గా ప్రశ్నలు అడిగి సమాధానాలు పొందే అవకాశం ఉంటుంది.
ప్రస్తుతం ఈ ఫీచర్ అమెరికాలో 18 ఏళ్లు పైబడిన కొంతమంది యూట్యూబ్ ప్రీమియం సబ్‌స్క్రైబర్లకు మాత్రమే అందుబాటులో ఉంది. త్వరలోనే ఇది అన్ని యూజర్లకు అందుబాటులోకి రానుందని సమాచారం. ఇప్పటివరకు యూట్యూబ్ సెర్చ్‌లో ఏదైనా విషయం టైప్ చేస్తే వీడియోల జాబితా మాత్రమే కనిపించేది. కానీ ‘Ask YouTube’ ఫీచర్‌తో సెర్చ్‌బార్‌లో కొత్త ఆప్షన్ కనిపిస్తుంది. దానిపై క్లిక్ చేస్తే యూజర్లు ప్రశ్నలు అడగడానికి ప్రత్యేక టెక్ట్స్ బాక్స్ ఓపెన్ అవుతుంది.
యూజర్లు అడిగిన ప్రశ్నలకు సంబంధించి వీడియోలతో పాటు, ఏఐ రూపొందించిన టెక్ట్స్ సారాంశం కూడా అందుబాటులో ఉంటుంది. దీని ద్వారా పెద్ద వీడియోలు చూడకుండా ముఖ్యమైన సమాచారం త్వరగా తెలుసుకోవచ్చు. అలాగే అవసరమైన సూచనలు కూడా ఈ ఏఐ చాట్‌బాట్ ఇస్తుంది. ఉదాహరణకు ట్రావెల్, కాఫీ షాప్స్, టెక్నాలజీ వంటి ఏ అంశంపై అయినా ప్రశ్న అడిగితే, సంబంధిత వీడియోలతో పాటు ముఖ్యమైన పాయింట్లను టెక్ట్స్ రూపంలో చూపిస్తుంది. దీని వల్ల యూజర్ల సమయం ఆదా అవుతుంది. మొత్తంగా చూస్తే, ఈ కొత్త ఏఐ ఫీచర్‌తో YouTube సెర్చ్ అనుభవం పూర్తిగా మారబోతోంది.
Andhra pradesh Andhrapradesh AndhraPradeshNews APNews BreakingNews Breaking news BusinessNews CricketNews CrimeNews EntertainmentNews Geopolitics Government India IndiaNews InternationalNews LatestNews LawAndOrder MarketUpdate News news24 newsalert NewsToday NewsUpdate PoliticalNews PublicSafety shivasakthi shivasakthienterprises shivasakthimedia shivasakthi net shivasakthinet shivasakthi news shivasakthinews ShivaSakthiUpdates ShivaShaktiMedia ShivaShaktiNews SportsNews TechNews Telangana TelanganaNews TeluguCinema TeluguNews Tollywood TrendingNews ViralNews WorldNews



















